విజయ్ ఆంటోని తన కెరీర్ ప్రారంభం నుంచి కొత్త కథలు, వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రయోగాలు చేస్తూ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా బహుముఖ ప్రతిభాశాలిగా ఆయన గుర్తింపు పొందారు. ఇప్పుడు తన 26వ చిత్రం ‘లాయర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘జెంటిల్ ఉమెన్’ ఫేమ్ రైటర్ జాషువా సేతురామన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామాగా రూపొందుతున్న ‘లాయర్’ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు.
Also Read: Odela 2: ఓటీటీలో దూసుకుపోతున్న ‘ఓదెల 2’
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాణంలో, మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 2025 నుంచి ప్రారంభం కానుంది. నటీనటులు, సాంకేతిక బృందం, మరియు ఇతర వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.