దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లోను రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ మిల్కీ బ్యూటీ హవా తెలియంది కాదు. సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామర్ అందాలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి తమన్నా పసందైన ఆహారాన్ని ఆరగిస్తుండటంతో తను ప్రయాణించాల్సిన విమానాన్ని అందుకోలేకపోయిందని షేర్ చేసింది. నూడిల్స్ ఫొటోను షేర్ చేస్తూ.. నేను ఎక్కాల్సిన ఫ్లైట్…
మిల్కీ బ్యూటీ తమన్నా ఓ పాపులర్ కుకింగ్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షోపై అధికారిక ప్రకటన వెలువడింది. “మాస్టర్ చెఫ్ ఇండియా” తెలుగు షోకు తమన్నా వ్యాఖ్యాతగా చేస్తోంది. జెమినీ టీవీలో వరల్డ్ ఫేమస్ కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ తెలుగు ఎడిషన్ రానుంది. ఈ షోలో విజేతకు రూ. 25 లక్షల బహుమతి ఇవ్వబోతున్నారు. అయితే ఇదే షోను తమిళంలో కూడా ప్రసారం చేయనున్నారు. అయితే తమిళ వెర్షన్…
మిల్కీ బ్యూటీ తమన్నా… ఏ ఒక్క క్రేజీ ఆఫర్ నూ మిస్ చేసుకోవడం లేదు! ఓ పక్క సినిమాలలో నటిస్తూనే, మరో పక్క పలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసిపోతోంది. ఇది చాలదన్నట్టుగా వెబ్ సీరిస్ చేస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళ వెబ్ సీరిస్ లలో నటించిన తమ్మూ, త్వరలో హిందీలో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సీరిస్ చేయబోతోంది. ఇక తాజాగా జెమినీ టీవీలో వరల్డ్ ఫేమస్ కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ తెలుగు…
యంగ్ హీరో నితిన్ కరోనా సమయంలోనూ డేర్ చేస్తున్నాడు. షూటింగ్ కు రెడీ అంటున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ దీనికి సమర్పకుడు. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమన్నా కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేశ్ నటిస్తోంది. ఈ చిత్రంలో…
ఇటీవలే ఓటిటి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా వెబ్ సిరీస్ లలో రాణిస్తోంది. రీసెంట్ గా విడుదల అయిన ‘11థ్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’లతో తమన్నాకు మంచి ఆదరణ లభించింది. దీంతో ఆమె మరిన్ని వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈమధ్య గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ బోల్డ్ పాత్రలపై ఫోకస్ పెడుతుందట. అలాంటి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నా నితిన్…
తోటి స్టార్ హీరోయిన్లు వెబ్ సీరిస్ లో నటించే విషయమై మీనమేషాలు లెక్కిస్తుంటే తమన్నా మాత్రం చక చకా ఈ కరోనా పేండమిక్ సమయంలో రెండు వెబ్ సీరిస్ లలో నటించేసింది. ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ ఇటీవల ఆహాలో స్ట్రీమింగ్ కాగా, దాని కంటే ముందే షూటింగ్ జరుపుకున్న ‘నవంబర్ స్టోరీ’ తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సీరిస్ ను తెలుగు, హిందీ భాషల్లో చూసే…
మిల్కీ బ్యూటీ తమన్నాకు, స్టార్ హీరోయిన్ కాజల్ కు మధ్య చక్కని స్నేహం ఉంది. అందుకే కాజల్ నటించిన తమిళ చిత్రం ‘ఘోస్టీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తమన్నా సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించింది. ప్రభుదేవాతో ‘గులేబకావళి’, జ్యోతికతో ‘జాక్ పాట్’ చిత్రాలను రూపొందించిన కళ్యాణ్ ఇప్పుడు కాజల్ నాయికగా ఉమెన్ సెంట్రిక్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కాజల్ పోలీస్ అధికారిణిగా నటిస్తోంది. ఈ హారర్ ఫాంటసీ డార్క్ కామెడీ మూవీలో యోగిబాబు, ఊర్వశి, దేవదర్శిని,…