మిల్కీ బ్యూటీ తమన్నా… ఏ ఒక్క క్రేజీ ఆఫర్ నూ మిస్ చేసుకోవడం లేదు! ఓ పక్క సినిమాలలో నటిస్తూనే, మరో పక్క పలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసిపోతోంది. ఇది చాలదన్నట్టుగా వెబ్ సీరిస్ చేస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళ వెబ్ సీరిస్ లలో నటించిన తమ్మూ, త్వరలో హిందీలో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సీరిస్ చేయబోతోంది. ఇక తాజాగా జెమినీ టీవీలో వరల్డ్ ఫేమస్ కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ తెలుగు ఎడిషన్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తమిళంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి సన్ టీవీలో ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాడు. ఆ సమయంలో తమన్నా గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ అధికారికంగా మాత్రం శుక్రవారమే దీనిని ప్రకటించారు.
Read Also : “హీరో”కు భారీ రెస్పాన్స్… టీం సెలెబ్రేషన్స్
తమన్నా మాత్రమే కాకుండా ఇన్ స్టాగ్రామ్ లో మాస్టర్ చెఫ్ తెలుగు పేజీలో ఓ వర్కింగ్ స్టిల్ ను ‘మాస్టర్ చెఫ్ ఇండియా -తెలుగును పరిచయం చేస్తున్నాం. జెమినీ టీవీలో అతిత్వరలో’ అనే కాప్షన్ తో పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జెమినీ టీవీ ఈ షోకి సంబంధించిన ప్రోమోను ట్విట్టర్ లో షేర్ చేసింది. అందులో విజేతకు రూ. 25 లక్షల బహుమతి ఇవ్వబోతున్నట్టు తెలిపింది. మరి ఈ కుకింగ్ షో తమన్నా కారణంగా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.