మిల్కీ బ్యూటీ తమన్నా రచయితగా మారింది. తాజాగా ఆమె తన బుక్ ను రిలీజ్ చేసింది. ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ ఈరోజు తన కొత్త పుస్తకం ‘బ్యాక్ టు ది రూట్స్’ ను ఆవిష్కరించింది. ఈ బుక్ కు ప్రముఖ లైఫ్ స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో సహ రచయిత. ఈ పుస్తకంలో తమన్నా ఆరోగ్య రహస్యాలను రివీల్ చేసింది. ఈ బుక్ ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అమెజాన్‌లో మొదటి స్థానంలో ఉంది.
Read Also : ‘లక్ష్య’ షూటింగ్ పూర్తి – థియేటర్లలోనే విడుదల!
“బ్యాక్ టు ది రూట్స్” గురించి తమన్నా మాట్లాడుతూ “ఆరోగ్యకరమైన జీవనానికి భారతదేశం పురాతన జ్ఞానం ఉన్న లైబ్రరీ. మనం ఆరోగ్యానికి సంబంధించి మన సాంప్రదాయక మార్గాలను పునఃపరిశీలించి, ఈ జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది. “బ్యాక్ టు ది రూట్స్” అన్ని అధ్యాయాలు కొత్త తరానికి ఉపయోగపడాలని ప్రయత్నించాము. ఇందులో పరీక్షించి సక్సెస్ అయిన రహస్యాలెన్నో ఉన్నాయి. లూక్ కౌటిన్హోతో ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని లోతుగా పరిశోధించే ప్రయాణాన్ని నేను ఆస్వాదించాను. ఈ రోజు ఈ పుస్తకం ద్వారా మన పూర్వీకుల జ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసి అందించాలనే మా లక్ష్యం నెరవేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా పాఠకులు ఈ పుస్తకాన్ని ఆస్వాదిస్తారని నేను ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
తమన్నా ప్రస్తుతం “అంధాధున్” తెలుగు రీమేక్‌లో కనిపించబోతోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. “అంధాధున్”లో తమన్నా టబు పాత్రలో కనిపించనుంది. ఇంకా తమన్నా వంట రియాలిటీ షో “మాస్టర్ చెఫ్”ను కూడా హోస్ట్ చేస్తోంది.