పండుగ పూట కొన్ని విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో తన చెల్లి వద్దకు రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ.. అనంత లోకాలకు చేరాడు ఓ యువకుడు..
మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానాలకు దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. తక్షణమే రంగంలోకి దిగి పోలీసులు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ప్రారంభించారు. మహాశివరాత్రి సందర్భంగా నదిలో స్నానానికి వెళ్లిన యువకులు.. లోతు ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో మునిగిపోయినట్టుగా భావిస్తున్నారు.