ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ఇప్పటి వరకు ఆ దేశంలో ఏర్పాటు చేసిన తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడంలేదు. దీంతో తాలిబన్ ప్రభుత్వంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ సమానమైన హక్కులు కల్పిస్తామని, మహిళల హక్కులను కాపాడతామని, సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని, చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారికి…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన తాలిబన్లు దానిని పక్కన పెట్టేశారు. షరియా చట్టాల ప్రకారమే పాలన ఉంటుందని, పురుషులు చేయలేని పనుల్లో మాత్రమే మహిళలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అంతేకాదు, విద్య విషయంలో కూడా మహిళలకు అన్యాయం జరుగుతున్నది. ఇక ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేయడానికి ఓ శాఖను ఏర్పాటు చేశారు. చట్లాలను ఏవరైనా ఉల్లంఘిస్తే చేతులు, కాళ్లు నరకడం, బహిరంగంగా ఉరితీయడం వంటివి తిరిగి అమలు…
యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు షాక్ తగిలింది. ఈ టోర్నీలో పాల్గొనాలంటే కొన్ని నిర్ణయాలు తప్పకుండ పాటించాలని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కు ఇప్పటివరకు 8 జట్లు అర్హత సాధించాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక్కటి. ఈ పొట్టి ఫార్మాట్ లో ఎంతో బలవంతమైన జట్టుగా ఎదిగిన ఆఫ్ఘన్ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్…
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తాలిబన్లకు పాక్ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటులో ఆ దేశం కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, దోహ ఒప్పందం ప్రకారం సమీకృత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ, ఆఫ్ఘనిస్తాన్ దానికి విరుద్ధంగా తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా వంటి సీనియర్…
ఈరోజు నుంచి న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. కాగా, ఈ సదస్సు జరిగే సమయంలోనే సార్క్ దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం కావాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తాలిబన్లను కూడా పిలవాలని పాక్ కొత్త మెలిక పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న ప్రస్తుత…
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు ఆక్రమించుకున్నాక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. తాలిబన్ అగ్రనేతలు అఖుండ్ జాదా, బరదర్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మార్పులు జరిగాయి. తాలిబన్ల కంటే ప్రభుత్వంలో హుక్కాని గ్రూప్ లకు పెద్ద పీట వేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు హుక్కాని గ్రూప్ కు, తాలిబన్లకు మధ్య అధ్యక్ష భవనంలో పెద్ద రగడ జరిగిందని, ఈ రగడలో హైబతుల్లా అఖుండ్ జాదా మృతి చెందారని, బరదర్ ను బందీగా చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు…
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి ఏంటో అందరికి తెలుసు. అక్కడ తాలిబన్ల పాలన మొదలైన సమయం నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే తాలిబన్ల రాక్షస పాలనకు బయపడి చాలా మంది ఆ దేశ విడిచి పారిపోయారు. అయితే తాలిబన్లు ఆ దేశంలోని అన్ని విషయాలతో పాటుగా క్రికెట్ లోకి కూడా వచ్చేసారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న హమీద్ షిన్వారీని ఆ పదవి నుండి తాలిబన్లు తొలగించారు. అతని స్థానంలో నసీబుల్లా…
గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. అక్కడి ప్రభుత్వం కూడా వారికి అధికారాన్ని అప్పగించేసింది. దాంతో అక్కడ తాలిబన్ల రాక్షస పాలన మొదలైంది. అయితే తాజాగా ఆఫ్ఘన్ లో తాలిబన్ ప్రభుత్వం ఐపీఎల్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మొదట వాయిదా పడిన ఐపీఎల్ ఇప్పుడు యూఏఈ వేదికగా జరుగుతుంది. కానీ తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో ఐపీఎల్ 2021 ప్రత్యక్ష ప్రసారని బ్యాన్ చేసారు తాలిబన్లు. ప్రేక్షకులలో మహిళలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబూల్ మేయర్గా హమ్దుల్లా నమోనీ నియమితులయ్యారు. కాగా, నమోనీ మహిళా ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిజైన్, ఇంజనీరింగ్, టాయిలెట్స్ క్లీనింగ్ విభాగాల్లో పనిచేసే మహిళలు మినహా మిగతా మహిళలు ఎవరూ కూడా ఉద్యోగాలకు హాజరుకావొద్దని ఆదేశాలు జారీచేశారు. మహిళలు ఇంటిపట్టునే ఉండాలని, బయటకు రావొద్ధని ఆదేశాలు జారీచేశారు. కాబూల్ నగరపాలక సంస్థలో మొత్తం 3 వేల మంది ఉద్యోగులు ఉండగా అందులో వెయ్యిమంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.…
తాలిబన్లు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందరికి సమానమైన గుర్తింపు ఇస్తామని, ప్రభుత్వంలో అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతామని చెప్పిన తాలిబన్లు దానికి విరుద్ధంగా చేశారు. ఒక్క మహిళకు కూడా మంత్రి వర్గంలో స్థానం ఇవ్వలేదు. పైగా మహిళలు ఇంటికే పరిమితం కావాలని, రాజకీయాల్లోకి వారి అవసరం లేదని చెప్పకనే చెప్పారు. బాలికల చదువుకు 1-5 తరగతుల వరకు మాత్రమే అనుమతించారు. దీంతో మహిళల పట్ల తాలిబన్లకు ఎలాంటి దృష్టి…