యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు షాక్ తగిలింది. ఈ టోర్నీలో పాల్గొనాలంటే కొన్ని నిర్ణయాలు తప్పకుండ పాటించాలని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కు ఇప్పటివరకు 8 జట్లు అర్హత సాధించాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక్కటి. ఈ పొట్టి ఫార్మాట్ లో ఎంతో బలవంతమైన జట్టుగా ఎదిగిన ఆఫ్ఘన్ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లో 8వ స్థానంలో ఉంది. అయితే గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. దాంతో అక్కడ వారు ఆఫ్ఘన్ జెండాను తీసేసి తమ జెండా ఎగరవేశారు. ఈ విషయంలోనే ఆఫ్ఘన్ జట్టుకు ఐసీసీ కీలక ఆదేశాలు ఇచ్చింది. యూఏఈలో జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గొనాలంటే ఆ జట్టు ఆఫ్ఘనిస్తాన్ జెండాతోనే రావాలి అని.. ఒకవేళ తాలిబన్ ల జెండాతో వస్తే వారి జట్టును ప్రపంచ కప్ నుండి తొలిగిస్తామని స్పష్టం చేసింది ఐసీసీ.