అంతర్జాతీయ సమాజం తమను గుర్తించాలని తాలిబాన్లు కోరుతున్నారు. అమెరికా సహా ఇతర దేశాలు తమను తమ ప్రభుత్వాలను గుర్తించాలని లేదంటే మొదటికే మోసం వస్తోందని పరోక్షంగా హెచ్చరిచారు.తమను గుర్తించకుండా విదేశి నిధులు, విదేశి బ్యాంకు ఖాతాలను నిలిపి వేస్తే సమస్యలు ఒక్క ఆప్ఘాన్ కే పరిమితం కావాన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించలేదు. సరికదా అమెరికా, ఐరోపా దేశాలు ఆప్గాన్‌కు నిధులను స్తంభింపజేశాయి. దీంతో ఆప్గాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాలిబాన్ అధికార ప్రతినిధి…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు తప్పుకున్నాక ఆ దేశంలో అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలు మళ్లీ తన ఉనికిని చాటుకోవడం మొదలుపెట్టాయి. ఇప్పటికే ఆఫ్ఘన్‌లో షియా ముస్లీంలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ దాడులు చేస్తున్నది. ఇటీవలే రెండు నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసి వందల సంఖ్యలో మరణాలకు కారణమయ్యాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు గుర్తించక పోవడంతో ఆ దేశంలో ఉగ్రసంస్థల బలం పెరిగే అవకాశం ఉందని, ఇది ఆఫ్ఘన్ దేశానికి మాత్రమే కాకుండా…
ఆఫ్ఘన్ లో పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి. అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటుతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆఫ్ఘన్ లోని టీచర్లు గత నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని టీచర్లు రోడ్డెక్కారు. జీతాలు రాకపోవడంతో తమకు కుటుంబపోషణతో పాటు పూట గడవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఒక్క హెరాత్ ఫ్రావిన్స్‌లోనే 30కి పైగా టీచర్లకు జీతాలు చెల్లించడం లేదంటున్నారు. ఇప్పటికైనా తాలిబాన్ ప్రభుత్వం తమకు…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. అయితే, ప్రపంచ దేశాల గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అయినప్పటికీ ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడంతో ఇబ్బందులు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నది. ఇక ఆఫ్ఘన్ భవితవ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. ఒకరు అమెరికా రాయబారి జల్మే ఖలిల్జాద్, ఘని, స్టానిక్జాయ్. ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారు. కానీ, ఇప్పుడు వీరు తీవ్రమైన…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు ఆ ప్రభుత్వాన్ని ప్రపంచదేశాలు గుర్తించలేదు. ప్రపంచ దేశాలు గుర్తించకపోవడంతో పాటుగా విదేశీ మారక ద్రవ్యనిల్వలను అమెరికా ఫ్రీజ్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ దిగుమతులు చేసుకోలేకపోతున్నది. దీంతో దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోవడంతో దేశంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ యదేచ్చగా రెచ్చిపోతున్నది. కాందహార్, కుందుజ్ లలోని మసీదుల్లో ఐసిస్ ఉగ్రవాదులు బాంబుపేలుళ్లకు పాల్పడుతున్నాయి. ఈ ఘటనలలో వందలాది…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ ప్రజల జీవనం అస్తవ్యస్తం అయింది. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆహారం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టు తాలిబన్లను స్పూర్తిగా తీసుకొని మిగతా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘన్‌లోని ఐసిస్ ఉగ్రవాద సంస్థ షియా ముస్లీంలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నది. కాందహార్, కుందుజ్ ప్రావిన్స్‌లో షియా ముస్లీంలు ప్రార్థనలు చేస్తున్న మసీదులపై దాడులకు పాల్పడింది. ఆ దాడుల్లో దాదాపుగా 160 మందికి పైగా ప్రజలు మృతి…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పాకిస్తాన్ దేశం ఒక్కటే కాబూల్‌కు విమానాలు నడుపుతున్నది. కాబూల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ విమానాలు కొన్ని పాక్‌కు నడుస్తున్నాయి. అయితే, కాబూల్ ఎయిర్ పోర్ట్ తిరిగి ఒపెన్ అయ్యాక విమాన సర్వీసులపై తాలిబన్ల జోక్యం అధికం అయింది. ఈ జోక్యం కారణంగా విమాన టికెట్ల ధరలను విపరీతంగా పెంచారు. కాబూల్ నుంచి ఇస్లామాబాద్‌కు టికెట్ ధరను ఏకంగా 2500 డాలర్లకు పెంచారు. గతంలో టికెట్ ధర 120 నుంచి 150 డాలర్ల మధ్యలో ఉండేది.…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ల ఆక్రమణ తరువాత ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాలిబన్లను చూసుకొని ఇతర ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోతున్నాయి. రష్యా, పాక్, చైనా మినహా మిగతా దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించకపోవడంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో పేదలకు సరైన ఆహారం దొరకడం లేదు. ఈ సమస్య నుంచి ఆఫ్ఘనిస్తాన్ బయటపడాలి అంటే…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత పాక్, రష్యా, చైనా దేశాలకు చెందిన ఎంబసీలు మినగా మిగతా దేశాలకు చెందిన ఎంబసీలను మూసేసిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్‌లో ప్రజాప్రభుత్వం కుప్పకూలిపోడంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాలని, ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. ఇందులో భాగంగా చైనా ముందుకు వచ్చి 30 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. తొలి విడతగా చైనా ఆఫ్ఘనిస్తాన్లోని శరణార్థుల కోసం దుప్పట్లు,…