భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించే ఆషాఢ బోనాలు ముహూర్థం ఖరారైంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి బోనాల వేడుకపై సమీక్ష నిర్వహించారు. అనంతరం తేదీలను ఖరారు చేశారు. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాఢ భోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 24న భాగ్యనగర బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలు…
అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండి పడ్డారు. మహంకాళి అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను పరీశించారు. అనంతరం ఉజ్జయిని ఆలయ అధికారులతో…
సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట డివిజన్ బండ మైసమ్మనగర్‌లో రూ.27.20 కోట్ల వ్యయంతో 310 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. వాటిని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేదల కలను ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని అన్నారు. కరోనా కారణంగా ఇండ్ల నిర్మాణం ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఎవరికి అన్యాయం జరుగకాకుండా లాటరీ పద్దతిలో…
సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట డివిజన్ బండ మైసమ్మనగర్‌లో రూ.27.20 కోట్ల వ్యయంతో 310 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. వాటిని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పేదలు ఆత్మ గౌరవంతో ఉండేలా ఇండ్లు నిర్మించాలని కలలు కన్నారని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కలలను సనత్ నగర్…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కాంట్రవర్సీ అంతకంతకు ముదురుతోంది. విశ్వక్ సేన్- టీవీ యాంకర్ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్ గా మారిన విషయం విదితమే. డిబేట్ నడుస్తుండగా.. లైవ్ లో విశ్వక్, యాంకర్ ను అసభ్యకరమైన పదంతో ఆమెను దూషించడం, ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం, విశ్వక్ పై అందరు దుమ్మెత్తిపోయడం జరిగాయి. ఇక ఇటీవలే తన తప్పు తెలుసుకున్నానని, ఆ పదం అన్నందుకు సారీ చెప్తున్నానని మీడియా ముందే విశ్వక్…
సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరనే విషయం గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవిని పెద్దన్నగా చెప్పుకుంటారు చాలామంది సినీ ప్రముఖులు. అయితే టాలీవుడ్ కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామాల వల్ల ‘నేను సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కాదు… కేవలం సినిమా బిడ్డ’ను మాత్రమే అంటూ చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే ఎవరికి ఏ సమస్య వచ్చినా తప్పకుండా ముందు ఉంటానని హామీ…
తెలంగాణలో మరోసారి పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దానికి ప్రధాన కారణం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనే చెప్పాలి… ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యూహాలు రచిస్తున్న పీకే.. కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం గట్టిగానే సాగుతోంది.. కొందరు సీనియర్ నేతల మాటలు చూస్తుంటే.. పీకే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఇదే సమయంలో.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని..! ఏకంగా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం కాబోతోందంటూ…
తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.. గవర్నర్ తమిళిసై మీడియాతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం, తనకు అవమానం జరిగిందంటూ వ్యాఖ్యలు చేయడం లాంటి ఘటనలు దూరం పెంచుతూ పోతున్నాయి.. ఇదే సమయంలో గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందేనని.. అధికార టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అవుతున్నాయి విపక్షాలు. అయితే, గవర్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్న…
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గవర్నర్ తమిళిసై చుట్టూ తిరుగుతున్నాయి.. ప్రభుత్వంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. ఇక, కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే.. అధికార టీఆర్ఎస్ మాత్రం ఆమెను టార్గెట్ చేసి కౌంటర్ ఎటాక్ చేస్తోంది… తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్‌కి కూడా పరిమితులు ఉంటాయి… ప్రధాని, హోం మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అని…