చైనా మరోసారి తన విస్తరణవాదానికి తెర లేపింది. తైవాన్ గగనతలంలోకి యుద్ధ విమానాలు పంపి ఉద్రిక్తత వాతావరణం సృష్టించడానికి చూస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి చైనా తైవాన్‌ను రెచ్చగొడుతుంది. ఇదే వారంలో రెండు సార్లు చైనా, తైవాన్ ఎయిర్ ఢిపెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోకి విమానాలను పంపింది చైనా. తాజాగా 13 విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపి చైనా వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకుంది.వీటిలో కంట్రోల్ (AEW&C) విమానం,ఆరు షెన్యాంగ్ J-16 మరియు రెండు చెంగ్డు J-10 ఫైటర్ జెట్‌లు…
గత కొన్ని రోజులుగా కరోనా కేసులు ప్రపంచంలో పెరుగుతున్నాయి. యూరప్, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. కాగా ఇప్పుడు తైవాన్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండోసారి కరోనా కేసులు ఎలా మొదలయ్యాయి అనే అంశంపై పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రెండోసారి కరోనా ఓ మహిళా సైంటిస్ట్ కు సోకిందని అమె ద్వారా తైవాన్‌లో మెల్లిగా కేసులు పెరుగుతున్నాయని వెల్లడైంది. Read: పెరుగు కోసం…
ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలపై చైనా కన్నేసింది. చైనా బెల్ట్ రోడ్ ప్రాజెక్ట్ పేరుతో వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఆయా దేశాలను రుణదేశాలుగా మారుస్తున్నది. ఆఫ్రికాలోని అనేక దేశాలను చైనా ఈ విధంగానే లోబరుచుకున్నది. చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు యూరోపియన్ దేశాల సమాఖ్య 300 బిలియన్ డాలర్లతో గ్లోబల్ గేట్‌వే ను ప్రకటించింది. ఇది చైనా మాదిరిగా చీకటి ఒప్పందాలు ఉండవని, దేశాలను అప్పులు ఊబిలోకి నెట్టడం జరగదని, చిన్న…
ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త వేరియంట్‌తో భయపడుతున్నది. ఎటు నుంచి దేశంలోకి ప్రవేశిస్తుందో తెలియక ఆందోళనలు చెందుతున్నారు. ఈ వేరియంట్ నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధిస్తే, ఇజ్రాయిల్ వంటి దేశాలు సరిహద్దులు మూసివేశాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే, చైనా మాత్రం తనకేమి తెలియదు అన్నట్టుగా బలప్రదర్శన చేస్తున్నది. Read: బ్రేకింగ్ : ఒమిక్రాన్‌పై సబ్ కమిటీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..…
కరోనా సమస్యకు ఇప్పుడిప్పుడే పరిష్కారం దొరుకుతున్నది. ఈ సమయంలో రెండు సమస్యలు ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. అందులో ఒకటి ఆఫ్ఘన్ సమస్య ఒకటి కాగా, రెండోది తైవాన్ సమస్య. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి ప్రజల పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. రెండు దశాబ్ధాలు అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి అక్కడి సైనికులకు కావాల్సిన శిక్షణను అందించినా లాభం లేకుండా పోయింది. ఈ సమస్య తరువాత తైవాన్ సమస్య ఇప్పడు ప్రపంచంలో కీలకంగా మారింది. ఆర్థికంగా…
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, తైవాన్ విషయంలోనూ రెండు అగ్రరాజ్యాల మధ్య వార్నింగ్‌ల పర్వం నడుస్తోంది.. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతివ్వడమంటే నిప్పుతో చెలగాటమాడినట్లే అంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్ ఇచ్చారు చైనా అధినేత జిన్ పింగ్.. ఈ విషయాన్ని చైనా మీడియా వెల్లడించింది… ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారిపోయింది.. జో బైడెన్, జిన్‌పింగ్ మధ్య…
అమెరికా.. చైనా దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆసియా ఖండంలో ఆధిపత్యం చలాయించేందుకు చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా ఆర్థికంగా వేగంగా అభివృద్దిచెందింది. అప్పటి వరకు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్థాయికి చైనా ఎదిగింది. ఆర్థిక ఎదుగుదలతో పాటుగా చైనా విస్తరణపై దృష్టి సారించడంతో సరిహద్దు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే టిబెట్, హాంకాంగ్‌పై పట్టు సాధించిన చైనా దృష్టి తైవాన్‌పై పడింది. వన్ చైనాలో…
ఇండో-ఫసిఫిక్‌లో మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఉద్రిక్తతలు తలెత్త కూడదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం హెచ్చ రించారు. ఆసియా- ఫసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్‌ఫోరమ్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా కొత్త భద్రతా కూటమి ఏర్పడిన తర్వాత చాలా వారాలకు జిన్‌పింగ్‌నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ కూటమిలో ఆస్ట్రేలియా అణు జలాంతర్గ ములను నిర్మించనుంది. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భౌగోళిక, రాజకీయ ప్రాతిపదికన ఈ…
చైనా-తైవాన్ వ్యవహారం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది.. తైవాన్ కూడా చైనాలో భాగమే. అది కచ్చితంగా మళ్లీ చైనాలో కలిసి తీరుతుంది. తైవాన్ ప్రజలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని తీరాల్సిందే.. లేని పక్షంలో సైనిక బలగాలను ఉపయోగించేందుకూ వెనకాడం అంటూ గతంలోనే హెచ్చరించారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్… ఇక, తాజాగా మరోసారి ఈ వ్యహారం తెరపైకి వచ్చింది.. ఈ వివాదంలో అమెరికా కూడా జోక్యం చేసుకుంటాం అంటోంది.. ఈ నేపథ్యంలో.. కీలక ప్రకటన చేసింది…
ఎలాగైనా తైవాన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చైనా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. తైవాన్ గగనతలంలోకి చైనా తన జెట్ విమానాలను పంపి భయపెట్టే ప్రయత్నం చేసింది. వన్ చైనా కు ఎవరు అడ్డువచ్చినా ఊరుకునేది లేదని ఇప్పటికే చైనా స్పష్టం చేసింది. అయితే, తైవాన్‌పై చైనా దాడికి దిగితే తైవాన్‌కు అండగా ఉంటామని, వారి తరపున పోరాటం చేస్తామని ఇప్పటికే అమెరికా హామీ ఇచ్చింది. అమెరికన్ కమాండోలు ఇప్పటికే తైవాన్‌లో దిగిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే,…