అనంతపురం జిల్లా తాడిపత్రిలో బహిరంగ ప్రదేశంలో చెత్త వేస్తే కుళాయి, విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.. తాడిపత్రిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ.. ఇకపై చెత్త వేస్తే తిరిగి వారి నివాసంలో వేస్తామని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు..
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల లోపు రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలలో వైసీపీ అధికారంలోకి రాగా.. తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది.