అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ సమాయత్తం అవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో.. తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల నుంచి 2500 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
గుంటూరు జిల్లాలో ఓ భూవివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. తాడేపల్లిలోని ఓ ప్రాంతంలో తమ భూమిలో నాగి రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేశాడని , తమ పై దాడి చేశాడని కోటేశ్వరావు అనే వ్యక్తి ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి అనే వ్యక్తిపై అతనికి మద్దతు ఇస్తున్న వారిపై కోటేశ్వరరావు రాజకీయంగా ఆరోపణలు చేయడంతో ఇప్పుడు వివాదం రాజకీయ రంగు పులుముకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి లోని పొలకం పాడులో ఓ…
ఏపీలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలోనే చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సంబంధించిన విల్లాల్లోకి చొరబడిన చెడ్డీ గ్యాంగ్… విలువైన వస్తువులు అపహరించేందుకు ప్రయత్నించింది. ఈ గ్యాంగులో ఉన్న ఐదుగురు సభ్యులు చెడ్డీలు, తలపాగాలు ధరించి ఉన్నారు. చేతిలో మారణాయుధాలు కూడా ఉన్నాయి. ఈనెల 3న అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా… మూడు రోజుల పాటు పోలీసులు ఈ విషయాన్ని…
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో తమ్మినేని సీతారాంకు చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యంగా ఉండటంతో ఇంట్లోనే వైద్యం తీసుకున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే తమ్మినేని సీతారాం ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆళ్లనాని స్పందించారు. మణిపాల్ ఆస్పత్రికి ఫోన్ చేసి ఆయన…