India Crush Bangladesh in T20 World Cup 2024 Warm-up Match: టీ20 ప్రపంచకప్ 2024కు ముందు శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఓడింది. మహ్మదుల్లా (40 రిటైర్డ్ హర్ట్ ; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్.…
స్టాప్ క్లాక్ రూల్ ప్రయోగాత్మకంగా విజయవంతం కావడంతో ఈ వరల్డ్ కప్ నుంచి వైట్ బాల్ ఫార్మాట్‌లో ఈ నిబంధనను ఉపయోగించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ స్టాప్ క్లాక్ నియమం ప్రకారం.. రెండు ఓవర్ల మధ్య, ఒక టీమ్ తర్వాతి ఓవర్ స్టార్ట్ చేసేందుకు 60 సెకన్ల సమయం ఇవ్వనుంది.
నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 స్టార్ట్ కానుంది. ఆతిథ్య దేశం అమెరికా, కెనడా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది. అయితే, ఈసారి టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ కలిసి ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 20 జట్లు ఈ టైటిల్ కోసం పోటిపడుతున్నాయి.
మే 30 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ జూన్ 2న టెక్సాస్ లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్ లో కెనడాతో సహ-హోస్ట్ అమెరికాతో తలపడనుంది. 2007లో ప్రారంభ ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్, జూన్ 5 న ఐర్లాండ్ తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 కోసం అమెరికాలో మొత్తం మూడు, కరేబియన్ లోని ఆరు వేదికలు ఉపయోగించబడతాయి. T20 ప్రపంచ…
527 రోజుల విరామం తర్వాత భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత రిషబ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) విడుదల చేసిన వీడియోలో, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులోని ఇతర సభ్యులతో నెట్ సెషన్ తర్వాత పంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత జెర్సీతో తిరిగి మైదానంలోకి రావడం పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని, నేను…
Virat Kohli on 2011 World Cup debut match: వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 2న ప్రపంచకప్ ఆరంభం కానుండగా.. జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత జట్టు న్యూయార్క్ చేరుకొని ప్రాక్టీస్ చేస్తోంది. ఐపీఎల్ 2024లో భారీగా పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారీ…
Terror Threat To Ind vs Pak Match in T20 World Cup 2024: మరో మూడు రోజుల్లో వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 2న మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు పొంచి…
విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ లు 2024లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కోసం ఓపెనింగ్ చేయాలని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ఐసీసీ T20 ప్రపంచ కప్ జూన్ 1 నుండి 29 వరకు వెస్టిండీస్, అమెరికా లలో జరగనుంది. టీమిండియా తమ ఏకైక వార్మప్ గేమ్ లో బంగ్లాదే శ్‌తో జూన్ 1న న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది. ఇకపోతే., టీమిండియా మాజీ ప్లేయర్ జాఫర్…
అమెరికా, వెస్టిండీస్‌లో జూన్ 2న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం న్యూయార్క్‌లో శిక్షణను ప్రారంభించింది. ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య జరిగే గేమ్ తో ఈ మెగా ఈవెంట్ మొదలు కానుంది. భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఆపై సూర్యకుమార్ యాదవ్, పేస్ బౌలర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరితో పాటు…
ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ పదవి కాలం రెండు రోజుల్లో మొదలయ్యే టి20 ప్రపంచ కప్ 2024 తర్వాత ముగియనుంది. దీంతో బీసీసీఐ మరోసారి రాహుల్ ద్రావిడ్ ను కొనసాగించకుండా కొత్త కోచ్ కోసం వెతుకులాటను మొదలు పెట్టింది. అయితే ఇందుకోసం బిసిసిఐ అప్లికేషన్లను కూడా స్వీకరించింది. ఇప్పటికే ఈ పదవి కోసం చాలామంది సీనియర్ ఆటగాళ్లు అప్లై చేసుకున్నట్లు సమాచారం. కాకపోతే భారతదేశంలో చాలామందికి కోరికగా ఓ అంశం నిలుస్తోంది. అదేంటంటే..…