T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ ఆరంభం.. కెనడాతో అమెరికా ఢీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
United States vs Canada Match Starts: అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అయింది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో కెనడాతో అమెరికా ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఆదివారం (జూన్ 2) ఉదయం 6 గంటలకు ఆరంభం అయింది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. కెనడా 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
క్రికెట్‌కు అంతగా ప్రాధాన్యం లేని అమెరికా.. వెస్టిండీస్‌తో కలిసి టీ20 ప్రపంచకప్‌కి ఆతిథ్యమివ్వబోతుండడం విశేషం. వెస్టిండీస్‌లో 2010లో మెగా పోరు జరిగింది. క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరింపజేయడంలో భాగంగా ఐసీసీ తొలిసారి 20 జట్లతో ప్రపంచకప్ నిర్వహిస్తోంది. ర్యాంకింగ్, ఆతిథ్య జట్టు హోదాలో టీమ్‌లు ముందుగా అర్హత సాధించగా.. క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా మరిన్ని జట్లు బరిలో నిలిచాయి. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగంగా ఉండటంతో.. ఈ ప్రపంచకప్ ద్వారా అక్కడి అభిమానులను ఆకర్షించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది.
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
Also Read: T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం!
20 జట్లను 5 టీమ్స్ చొప్పున 4 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో తలపడుతుంది. టాప్-2లో నిలిచిన రెండు టీమ్‌లు సూపర్ ఎయిట్‌కు చేరుకుంటాయి. సూపర్ ఎయిట్‌లో ఎనిమిది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విడదీస్తారు. ఒక్కో టీమ్ మిగిలిన మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన రెండు టీమ్‌లు సెమీస్ ఆడుతాయి. చివరగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వెస్టిండీస్‌లో ఆరు, అమెరికాలలో మూడు వేదికలలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?