RostonChase rescues West Indies for a winning start in T20 World Cup 2024: రెండుసార్లు టీ20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్.. పసికూన పాపువా న్యూగినియాపై చెమటోడ్చి గెలిచింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గ్రూప్ సిలో పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పసికూన నిర్ధేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విండీస్ ఆపసోపాలు పడింది. రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్; 27 బంతుల్లో 4…
Surya Kumar Yadav Looks Very Strong for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 నేడు ఆరంభమైంది. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ప్రపంచకప్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సిద్దమయ్యాడు. మునుపెన్నడూ లేనంత ఫిట్‌గా సూర్య కనిపిస్తున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స తర్వాత పెరిగిన బరువును తగ్గించుకోవడమే అందుకు కారణం. పొట్టి ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని.. మిస్టర్ 360 సూర్య 15 కిలోల…
Hardik Pandya on Problems: ఐపీఎల్ 2024లో కెప్టెన్‌గా విఫలం, టీ20 ప్రపంచకప్ 2024 జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు, విడాకుల రూమర్లు.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వరుసగా చుట్టుముట్టాయి. ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ అనంతరం అన్నింటిని పక్కనపెట్టి లండన్ వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యాడు. తాజాగా భారత జట్టుతో కలిసిన హార్దిక్.. బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చెలరేగాడు. 40 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. మ్యాచ్…
Highest targets succesfully chased in T20 World Cups: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా చరిత్ర సృష్టించింది. పొట్టి టోర్నీ చరిత్రలో మూడో అత్యధిక ఛేదన సాధించిన జట్టుగా యూఎస్ చరిత్రకెక్కింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ రికార్డు యూఎస్ ఖాతాలో చేరింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని అమెరికా 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. యూఎస్ విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46…
Fan hugged Rohit Sharma in IND vs BAN Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శనివారం న్యూయార్క్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వామప్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు దూసుకొచ్చిన ఆ అభిమాని.. హిట్‌మ్యాన్‌ను హగ్ చేసుకున్నాడు. రోహిత్ కూడా అతడిని ఏమీ అనకుండా ఉండిపోయాడు. అయితే…
Virat Kohli with ICC ODI Player Of The Year Award: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవార్డు అందుకున్నాడు. ‘ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆదివారం న్యూయార్క్‌లో అందుకున్నాడు. అంతేకాదు ‘ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’ 2023 క్యాప్‌ను కూడా విరాట్ స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. 2012, 2017,…
United States won by 7 wkts against Canada in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా బోణీ కొట్టింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని యూఎస్ 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 197 రన్స్ చేసి గెలిచింది. అమెరికా విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46 బంతుల్లో…
Navneet Dhaliwal First Batter To Hit 1st Half Century in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో మొదటి సమరం జరుగుతోంది. అమెరికా, కెనడా జట్ల మధ్య ఈరోజు ఉదయం 6 గంటలకు మ్యాచ్ ఆరంభమైంది. డలాస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్…
Pakistan and West Indies have won T20 World Cup most times: అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఆకర్షణీయ టోర్నీ టీ20 ప్రపంచకప్ 2024 నేడు ఆరంభమైంది. వెస్టిండీస్‌తో కలిసి అగ్రరాజ్యం అమెరికా టీ20 ప్రపంచకప్‌కు తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. 8 అగ్రశ్రేణి జట్లకు తోడు మరో 12 టీమ్‌లు విశ్వ వేదికపై తమదైన ముద్ర చూపాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో టి20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగనుంది. అమెరికా, కెనడా మధ్య మ్యాచ్…
United States vs Canada Match Starts: అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అయింది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో కెనడాతో అమెరికా ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఆదివారం (జూన్ 2) ఉదయం 6 గంటలకు ఆరంభం అయింది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. కెనడా 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, హాట్…