Rishabh Pant: థాంక్యూ గాడ్.. అంటూ రిషబ్ పంత్ ఎమోషనల్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
527 రోజుల విరామం తర్వాత భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత రిషబ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) విడుదల చేసిన వీడియోలో, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులోని ఇతర సభ్యులతో నెట్ సెషన్ తర్వాత పంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత జెర్సీతో తిరిగి మైదానంలోకి రావడం పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని, నేను చాలా కోల్పోయాను అని పంత్ అన్నాడు. ఇక ప్రస్తుతం ఇక్కడ సహ ఆటగాళ్లను చూడటం, వారిని మళ్లీ కలవడం, సమయం గడపడం, వారితో సరదాగా గడపడం లాంటివి నేను నిజంగా నేను నిజంగా ఆనందించానని తెలిపాడు.
అలాగే X ఖాతా ద్వారా చేసిన పోస్ట్ లో దేవుడా.. నీకు ధన్యవాదములు. భారతీయ జెర్సీ ధరించడం నాలో కృతజ్ఞత, ఆనందం, గర్వాన్ని నింపుతుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందడం కంటే మెరుగైన అనుభూతి మరొకటి లేదని పంత్ రాశాడు. భారత వికెట్ కీపర్ సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి చిత్రాలకు పోజులిచ్చాడు. ఐపీఎల్ 2024ను పంత్ బ్యాట్ తో అద్భుతమైన ప్రదర్శన చేసాడు. అతను 13 మ్యాచ్‌లలో 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. మూడు అర్ధ సెంచరీలతో పాటు జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కెప్టెన్ గా కూడా ఉన్నాడు.
Also Read
కాకపోతే జట్టు IPL 2024 పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది. అతని అద్భుత ప్రదర్శన భారత జట్టుకు ఎంపికయ్యేలా చేసింది. మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు పంత్ మొదటి బ్యాచ్ భారతీయ ఆటగాళ్లతో కలిసి అమెరికాకు వెళ్లాడు.
Thank you, God. Wearing the Indian jersey fills me with gratitude, joy and pride. There’s no better feeling than getting a chance to represent your country 🫶🇮🇳 👕#RP17 pic.twitter.com/wYHgeporjA
— Rishabh Pant (@RishabhPant17) May 29, 2024
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!