ఆస్ట్రేలియాపై సిరీస్ విజయోత్సాహంతో టీ20 ప్రపంచకప్‌కు ముందు మరో టీ20 సిరీస్‌కు రోహిత్ సేన సిద్ధమైంది. ఆస్ట్రేలియాపై గెలిచిన రెండు రోజుల వ్యవధిలోనే సఫారీతో రెండో వేటకు సిద్ధమైంది.
IND Vs WI: శిఖర్ ధావన్ నేతృత్వంలోని వన్డే సమరం ముగిసింది. నేటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 సిరీస్ సమరానికి తెర లేవనుంది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ కూడా చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్, హార్డిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లాంటి స్టార్ ఆటగాళ్లు టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. వన్డే సిరీస్‌లో తుది జట్టులో ఆడిన…
ఐపీఎల్ తర్వాత టీమిండియా బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెండుగా చీలిపోయింది. ఒకే సమయంలో వివిధ సిరీస్‌లు ఉండటంతో సెలక్టర్లు సీనియర్, జూనియర్ జట్లను వేర్వేరుగా ప్రకటించారు. సీనియర్ జట్టు ఇంగ్లండ్‌లో ఉండగా.. జూనియర్ జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. టీమిండియా, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల సిరీస్ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు…
కోహ్లి, రోహిత్, రాహుల్, బుమ్రా, షమి లాంటి సీనియర్ల గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత.. తిరిగి పుంజుకున్న టీమ్‌ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ఆడేందుకు రెడీ అయింది. ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతో బరిలోకి దిగి.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎదురు దెబ్బల తర్వాత గొప్పగా పుంజుకుని సిరీస్‌ను సమం చేసిన టీమ్‌ఇండియా.. అదే ఊపును కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు సమిష్టిగా సత్తాచాటి కప్పు కొట్టేయాలని…
ఐపీఎల్‌లో సత్తాచాటి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న ఆటగాడు అవేశ్ ఖాన్. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా పేసర్ అవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేయడంతో దాన్ని వాళ్ల నాన్నకు అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో అంతగా రాణించకపోయినా.. అతడు ఈ మ్యాచ్‌లో 4/18 మేటి ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్‌ఇండియా 82 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం…
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–2తో సమం చేసింది. శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. మొన్న మూడో టీ20 మ్యాచ్ గెలిచిన భారత కుర్రాళ్లు… నేడు నాలుగో టీ20లోనూ దుమ్మురేపేశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు)…
రిషబ్ పంత్ సారథ్యంలో యంగ్ టీమిండియా టీ-20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుండగానే మరోవైపు సీనియర్ ఆటగాళ్లు లండన్‌కు పయనమయ్యారు. గురువారం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారాతో పాటు పలువురు ఆటగాళ్లు లండన్ బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడనుంది టీమిండియా. జులై 1న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ…
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్‌క్రమ్ భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన అతడు మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఆడడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చెప్పింది. పాజిటివ్‌గా తేలిన తర్వాత మార్‌క్రమ్ ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడు తిరిగి జట్టుతో చేరి సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయంతో బాధపడుతున్న డికాక్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్రికెట్…
విశాఖపట్నం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-0తో వెనుకబడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ కోల్పోతుంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిస్తే దక్షిణాఫ్రికాకు సిరీస్ సొంతం అవుతుంది. దీంతో ఇరుజట్లు ఈ మ్యాచ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకపోవడంతో టీమిండియా ఒత్తిడికి గురవుతోంది. సత్తా ఉన్న కుర్రాళ్లు జట్టులో ఉన్నా..…
రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికా బీచ్‌లో కోహ్లీ సేదతీరాడు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ బీచ్‌లో సెలవులను ఆనందంగా గడుపుతున్నాడు. విరాట్ తన ట్విటర్‌లో బీచ్‌లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశాడు. 33 ఏళ్ల కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి దూరంగా బీచ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2022 అనంతరం జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20…