టర్కీ, సిరియాలను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరోసారి భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది.
సోమవారం తెల్లవారు జామున టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం విలయాన్ని సృష్టించింది. ఈ భారీ భూకంపం కారణంగా 670 మందికి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదైంది.