ఎన్‌సీఈఆర్‌టీ మూడు, ఆరు తరగతుల సిలబస్‌లో మార్పులు చేసింది. సిలబస్ మార్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ కార్యదర్శి, విద్యాసంస్థలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు.
APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఇప్పటివరకు గ్రూప్ 2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని రెండుకు కుదించేశారు.. ఈ మేరకు శుక్రవారం జీవో 6ను విడుదల చేసింది ప్రభుత్వం.. పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ…
తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం.. త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇందులో ఉపాధ్యాయు పోస్టులు కూడా ఎక్కువగా ఉండటంతో డీఎస్సీ అభ్యర్థులు ప్రిపరేషన్‌లో పడిపోయారు. అయితే.. టెట్ విషయంలోనే కాస్త గందరగోళం నెలకొంది. బీఈడీ పూర్తిచేసిన బయాలజీ, లాంగ్వేజ్ పండిట్లు.. టెట్‌ని తలుచుకుని ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనకు కారణమేంటి? ఓవైపు నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆనందం ఉన్నా.. కొందరు అభ్యర్థుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఇంటర్, డిగ్రీలో బయాలజీ చదివిన వారికి.. ఇప్పుడు…
ఒకవైపు కరోనా… మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం విద్యార్ధులకు ఊరట కలిగించనుంది. సిలబస్ తగ్గించడంతో పాటు ఛాయిస్ ప్రశ్నలు కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు. ఎల్లుండి నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభం అవుతాయి. విద్యార్ధులపై వత్తిడి తగ్గించాలని నిర్ణయించింది. టెన్త్ ఇంటర్ పరీక్షలు కూడా ఆలస్యం కానున్నాయి. మార్చి, ఏప్రిల్ లో జరగాల్సిన పరీక్షలు మే నెలలో జరుగుతాయని తెలుస్తోంది. గత ఏడాది నిర్వహించినట్టుగానే 70…