అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందుగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. జేడీ వాన్స్ చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. అగ్ర రాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేశారు. ట్రంప్ చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.
తమిళనాడులోని ఎంకే స్టాలిన్ ప్రభుత్వ మంత్రివర్గంలో ఈరోజు భారీ మార్పు చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
సెప్టెంబర్ 21న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేసారు. ఈ క్రమంలో.. అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్‌కి తన రాజీనామాను సమర్పించారు. అతిషి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దావా వేశారు.
ఆదివారం మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. సాయంత్రం 7:15 గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విపక్షాలకు మినహా విదేశీయులను ఆహ్వానించారు
ఆదివారం మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకారానికి విపక్ష పార్టీలను ఇప్పటి వరకు ఆహ్వానించలేదు.
నరేంద్ర మోడీ.. దేశ ప్రధానిగా మూడోసారి ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7:30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు.
తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అంతేకాకుండా.. రాష్ట్రం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు.
రాష్ట్రపతి అంటే దేశ ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు అని అర్థం. అందుకే రాష్ట్రపతి పదవిని అత్యున్నత పదవిగా అందరూ భావిస్తారు. అలాంటి అత్యున్నత పదవిని గిరిజన మహిళ ద్రౌపది ముర్ము సొంతం చేసుకున్నారు.