తెలుగు సినీ ప్రేక్షకులకు ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మరో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రం ఏదో కాదు, ‘L2E ఎంపురాన్’. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మార్చి 27, 2025న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మురళి గోపి రాసిన కథతో లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్…