తెలుగు సినీ ప్రేక్షకులకు ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మరో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రం ఏదో కాదు, ‘L2E ఎంపురాన్’. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మార్చి 27, 2025న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మురళి గోపి రాసిన కథతో లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేయనుండటం విశేషం.
Chiru-Anil: మెగాస్టార్ సినిమాలోనూ బుల్లి రాజు?
మోహన్‌లాల్ మరోసారి ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి పాత్రలో కనిపించి అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. అలాగే, ఓ’నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘L2E ఎంపురాన్’ హై ఆక్టేన్ యాక్షన్, స్టైలిష్ ప్రజంటేషన్‌తో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మార్చి 27న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది!