నార్వే యువరాణి మెట్టే మారిట్ పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హోయిబీ(27) అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. రేప్ కేసులో హోయిబీని సోమవారం ఓస్లోలో పోలీసులు అరెస్ట్ చేశారు.
అనుమానం పిచ్చితో భార్యను హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. భర్త నర్సింహులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో గ్యాస్ డెలివరి బాయ్ గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం చిట్కుల్ గ్రామనికి చెందిన ఇందిరతో నర్సింహులుకి వివాహం అయింది. అయితే.. 13 ఏళ్లుగా సాఫీగా సాగుతున్న జీవితంలో అనుమానం అనే ఓ దెయ్యం వచ్చి ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్‌లో భార్యను హత్య చేసి మృతదేహాన్ని స్వస్థలం ఆందోల్ కి తీసుకువచ్చాడు నిందితుడు.…
రైలులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడిపై కొందరు యువకులు చితకబాదారు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్‌లోని ఇగత్‌పురి సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వృద్ధుడు రైలులో ప్రయాణిస్తుండగా.., అతను బీఫ్ మటన్ తీసుకెళుతున్నాడనే అనుమానంతో కొందరు యువకులు దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో ఓ మహిళపై క్రూరత్వం చూపించారు. కనికరం లేకుండా.. దాడి చేశారు. ఈ ఉదంతం ఉత్తర ప్రదేశ్లోని సూరజ్‌పూర్ ఖేడీ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే.. తమ కూతురు అనారోగ్యానికి కారణం ఆ మహిళేనని.. తాను చేతబడి చేస్తుందని అనుమానించారు. దీంతో.. బాలిక కుటుంబీకులు ఆ మహిళను తీవ్రంగా కొట్టారు. అంతే కాకుండా జుట్టు కూడా కత్తిరించారు.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో హత్యలు ఆగేలా కనిపించడం లేదు. ఢిల్లీలో ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి. ఇటీవలే అక్కడ జంట హత్యలు కలకలం రేపుతుండగా తాజాగా మరో జంట హత్యల కలకలం రేగింది.