Delhi: దేశ రాజధాని ఢిల్లీలో హత్యలు ఆగేలా కనిపించడం లేదు. ఢిల్లీలో ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి. ఇటీవలే అక్కడ జంట హత్యలు కలకలం రేపుతుండగా తాజాగా మరో జంట హత్యల కలకలం రేగింది. తన భార్య పక్కింటి వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఇద్దరినీ దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. హత్యలకు పాల్పడిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. భర్త పేరు ఇమ్రాన్. ఈ ఘటనతో ఢిల్లీలో కలకలం రేగింది.
Read Also:Dharmana Prasada Rao: ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే చెల్లదు..
తమ ఇంటి పక్కనే నివసిస్తున్న సంజీత్‌తో తన భార్య కుష్బు అనైతిక సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. దీంతో తరచూ ఈ విషయమై ఆమెతో గొడవ పెట్టుకునేవాడు. వివాదం కాస్త ముదిరి భార్యను, తన పొరుగింటి వ్యక్తిని హతమార్చాడు. తొలుత సంజీత్‌పై.. ఇమ్రాన్ కత్తితో దాడి చేశాడు. దీంతో వెంటనే సంజీత్ కుటుంబీకులు అతన్ని బీఎస్‌ఏ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. తర్వాత తన సొంత భార్యను కూడా గొంతు కోసి చంపాడు.
Read Also:Virat Kohli Record: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. టాప్ 5 లిస్టులోకి!
హత్య అనంతరం నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను హత్య చేశానని చెప్పడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. పోలీసులు వెంటనే ఆమెను బీఎస్‌ఏ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. అనంతరం పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతులిద్దరి మధ్య నిజంగానే అనైతిక సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మృతుల ఇరువురి కుటుంబీకులను కలిచివేసింది.