ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు నిప్పంటించుకున్నాడు. మొదట తన ప్రియురాలి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరాడు.. దీంతో ప్రియురాలు నిరాకరించడంతో యువకుడు సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి పెట్రోల్ తీసుకుని మళ్లీ ప్రియురాలి దగ్గరకు వచ్చాడు. మళ్లీ చివరగా పెళ్లి చేసుకోవాలని అని అడగగా.. అప్పుడు కూడా నిరాకరించడంతో యువకుడు తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
వివాహితకు కాల్ చేసిన తిరుపతి తాను చెప్పినట్లు వినాలని లేదంటే వీడియోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని వేధించాడు. అతడి వేధింపులతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో ఈ వేధింపులు భరించలేక వివాహిత గురువారం ఇంట్లోని సంపులో దూకి ఆత్మహత్యయత్నం చేయగా.. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆకుతోట సౌజన్య మృతి చెందింది.
హైదరాబాద్ పెద్దమ్మతల్లి గుడి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శేజల్ ను పేస్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. శేజల్ కి ఎమర్జెన్సీ బ్లాక్ లో చికిత్స అందిస్తున్నట్లు.. శేజల్ ఔటాఫ్ డేంజర్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఆయుర్వేదిక్ సంబంధించిన నిద్ర మాత్రలు వేసుకున్నట్లు తెలిపారు. మరికొద్దిసేపట్లో శేజెల్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు పేస్ అసుపత్రి వైద్యులు తెలిపారు.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న విద్యార్థి రాహుల్ ఇంట్లో గొడవ పడి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ధనలక్ష్మి ఫర్టీ లైజర్ షాపులో పురుగుల మందు కొనుగోలు చేసి పక్కనే ఉన్న పర్వతపురం గుట్టల్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం రాహుల్ ఇంటికి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నట్లు తెలిపాడు.
సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఈ ఘటన జరిగింది. కుమారుడు, కూతురిని భవనం 8వ అంతస్తు నుంచి కిందపడేసిన అనంతరం.. తల్లి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కవలలుగా గుర్తించారు.
హైదరాబాద్ బోయినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పు గోదావరికి చెందిన విజయలక్ష్మీ భర్త, తన ఇద్దరు కూతుళ్లతో బోయినపల్లిలో నివసిస్తోంది. ఇటీవలే ఇంటి పెద్ద, తమ తండ్రి చనిపోయాడు. అయితే తన తండ్రి లేడన్న బాధతో అప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పీయూసి ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపికగా గుర్తించారు. మృతురాలు స్వస్థలం సంగారెడ్డి జిల్లా గొర్రెకల్.
అనకాపల్లి జిల్లాలోని దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పెంటకోట మధుకుమార్ ( 20 ) అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్ లు కట్టే అలవాటున్న మధుకుమార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పందేల కోసం అదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలంటూ అతడి నుంచి ఒత్తిడి పెరిగింది. అయితే, తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ నెల 23న రాత్రి ఎలుకల మందు…