నక్సలిజాన్ని రూపుమాపేందుకు, మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది మావోలు భద్రతబలగాల ఎన్ కౌంటర్ లో మృతిచెందారు. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో మావోయిస్టులు కలిసిపోయారు.. లొంగిపోయిన వాళ్లలో ముగ్గురు రాష్ట్రస్థాయి లీడర్లు.. కొందరు హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు. లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర…