ఉక్రెయిన్ కు తాము దీర్ఘ శ్రేణి క్షిపణులు పంపుతామని బ్రిటన్ ఇటీవలే ప్రకటించింది. ఇంకా ఏం చేయాలన్న విషయంపై జెలెన్ స్కీతో చర్చించానని రిషి సునక్ ఇవాళ వెల్లడించారు. తమకు సాయం చేస్తున్నందుకు ఉక్రెయిన్ ప్రజల తరఫున, సైనికుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నానని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు.