ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హవా నడుస్తోంది. సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘విరూపాక్ష’ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ 70 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇతర భాషల్లో కూడా రిలీజ్ కి రెడీ అవుతున్న విరుపాక్ష, కాంతార రేంజ్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఈ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు తేజ్. సుకుమార్ శిష్యుడు…
గతేడాది రిపబ్లిక్ మూవీతో మంచి హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ గురైన సంగతి తెలిసిందే. దాంతో కోలుకోవడానికి సాయికి చాలా సమయం పట్టింది. ఇక అంతా సెట్ అయ్యాక.. తిరిగి సినిమా సెట్‌లోకి అడుగుపెట్టాడు సాయి ధరమ్. ప్రస్తుతం తన 15వ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే SDT15 పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సుకుమార్ రైటింగ్స్‌లో కార్తిక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.…
‘మెగా’ నటుడు సాయిధరమ్ తేజ్ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్ తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. అయితే బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక…
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం రాజకీయాలు ప్రస్తుత పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… ఇందులో జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన ‘రిపబ్లిక్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పటికే…