ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హవా నడుస్తోంది. సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘విరూపాక్ష’ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ 70 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇతర భాషల్లో కూడా రిలీజ్ కి రెడీ అవుతున్న విరుపాక్ష, కాంతార రేంజ్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఈ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు తేజ్. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు డైరెక్ట్ చేసిన విరుపాక్ష మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు. విరూపాక్ష ఎండ్ సీన్ లో సీక్వెల్ ఉంటుందా? అనే క్వేషన్ ని రైజ్ చేసిన చిత్ర యూనిట్, ఆడియన్స్ ని థ్రిల్ చేసి థియేటర్ నుంచి బయటకి పంపించారు. పోస్ట్ రిలీజ్ ప్రెస్ మీట్స్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ విరుపాక్ష సినిమాకి సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందనే కదా హింట్ ఇచ్చాం, తప్పకుండా ఉంటుందని తేజ్ చెప్పడంతో విరూపాక్ష2 కన్ఫామ్ అయిపోయింది. విరుపాక్ష సీక్వెల్ కంటే ముందే మరో హిట్ సీక్వెల్‌ని లైన్లో పెట్డాడు తేజ్.
దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన ‘రిపబ్లిక్’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే తేజ్‌కు యాక్సిడెంట్ అయింది. దాంతో స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్ చేశాడు. ఇంజ్యూరీస్ నుంచి కోలుకున్న తర్వాత ‘విరూపాక్ష’తో సాలిడ్ హిట్టాడు కొట్టాడు సుప్రీమ్ హీరో. ప్రస్తుతం పవన్‌తో కలిసి ‘వినోదయ సీతమ్’ రీమేక్ చేస్తున్నాడు తేజ్. ఈ మూవీ తర్వాత ఒక లవ్ స్టొరీ చెయ్యడానికి రెడీ అయిన తేజ్, రిపబ్లిక్ సీక్వెల్ కూడా స్టార్ట్ చెయ్యబోతున్నాడట. రిపబ్లిక్ సినిమాకి సీక్వెల్ చెయ్యాల్సి వస్తే పవన్ కళ్యాణ్, తేజు కాంబినేషన్‌లో చేయాలని ఉందని దేవకట్టా చెప్పాడు. ఇప్పుడు పవన్ యమా స్పీడ్ మీదున్నాడు కాబట్టి ఇదే జోష్ లో రిపబ్లిక్ సీక్వెల్ కథ చెప్పి ఒప్పించదానికి రెడీ అవుతున్నాడట. ఇదే జరిగితే మెగా మేనల్లుడు నుంచి రెండు సీక్వెల్స్, అది కూడా పవన్ కళ్యాణ్ తోనే చెయ్యడం జరుగుతుంది. మరి మామా అల్లుళ్లు కలిసి ఇంకో సినిమా చేస్తారా? తేజ్ కి సీక్వెల్స్ కలిసోస్తాయా అనే ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి.