DY Chandrachud: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ను కూడా స్కామర్లు వదల లేదు. ఆయన ఫొటో, ఆయన పేరుతో నకిలీ ఐడీ క్రియేట్ చేసి పలువురికి మెసెజ్ లు పెట్టిన డబ్బులు అడుగుతున్నారు. కాగా, ఇటీవల ఎక్స్ యూజర్ కైలాష్ మేఘ్వాల్ కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫొటో, పేరుతో ఐడీ క్రియేట్ చేసిన ఒక స్కామర్ ఆ మెసేజ్ పంపించాడు. ఆ వ్యక్తి నుంచి తనకు వచ్చిన మెసేజ్ స్నాప్ షాట్ ను మేఘవాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ సందేశంలో మోసగాడు తమను తాము సీజేఐగా పరిచయం చేసుకుని, తమకు అత్యవసర కొలీజియం మీటింగ్ ఉందని.. తాను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో చిక్కుకున్నాను.. క్యాబ్ కు రూ.500 అవసరమని చెప్పుకొచ్చాడు.. కోర్టుకు వెళ్లిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని సీజేఐ పేరుతో వచ్చిన మెసేజ్ లో హామీ ఇచ్చారు. సందేశం చివరలో, స్కామర్ టెక్స్ట్ నిజమైనదిగా కనిపించడానికి “ఐప్యాడ్ నుంచి పంపబడింది” అనే మెసేజ్ ను కూడా జత చేశాడు.
Read Also: Earthquake: శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు.. జనం పరుగులు..
అయితే, ఈ మెసేజ్ ను ఆగస్టు 25వ తేదీన ఎక్స్ లో కైలాష్ మేఘ్వాల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కు ‘‘ఫ్రెండ్స్ ఏం చేయమంటారు?’’ అనే కామెంట్ ను జగ చేశాడు. ఆ పోస్ట్ కు 2 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. 2,500కు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది ఈ పోస్ట్ కు కామెంట్స్ సెక్షన్ లో తమ స్పందనలను తెలియజేశారు. ‘తాను చూపించిన అతి విశ్వాసానికి వెయ్యి రూపాయలు పంపండి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అతను దానిని ‘ఐప్యాడ్’ నుంచి పంపాడు.. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధమైనదే’’ అని మరో యూజర్ పన్నీ కామెంట్స్ చేశారు. ఆ అభ్యర్థనను మరో మూడు వారాలకు వాయిదా వేయండి.. త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి తీర్పు ఇవ్వండి అంటూ మరొక నెటిజన్ పోస్ట్ చేశారు.