2025 ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. గత కొన్ని రోజులుగా ఈ మ్యాచ్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతలో పూణేకు చెందిన సామాజిక కార్యకర్త కేతన్ తిరోద్కర్ ఈ మ్యాచ్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మ్యాచ్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ ఆఫ్ మాండమస్ లేదా ఇతర తగిన ఉత్తర్వులను జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Phone Tapping Case: తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్ళిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు ప్రభాకర్ రావును ఐదు సార్లు విచారించారు. సుమారు…
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదానికి సంబంధించి ఇద్దరు వైద్యులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే సుమోటోగా విచారణ చేపట్టి, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు (ఇందులో అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ రెసిడెంట్ వైద్యులు కూడా ఉన్నారు) ఒక్కొక్కరికి రూ.50 లక్షల మధ్యంతర పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని, వెంటనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
NEET : నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న ఎన్టీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. తొలుత ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.