ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఎప్పుడు..? సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణ ముగిస్తారా..? ఇప్పటికే 8మందిని విచారించగా ఆ ఇద్దరి దగ్గరే ఎందుకు ఆగింది? ఎవరా శాసన సభ్యులు? ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు? తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 8 మంది విచారణ ముగించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అందులో ఏడుగురికి సంబంధించి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ మీదున్న అనర్హత…