నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ముగింపు దశకు చేరుకొంది. గత కొన్ని వారాలుగా విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ తాజా సీజన్ త్వరలో ఎండ్ కాబోతోంది. ఇక ఈ చివరి ఎపిసోడ్ ని సూపర్ స్టార్ మహేష్ తో ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయి. ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ…
తక్కువ టైమ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడమే కాదు… పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తనదైన అటిట్యూడ్ తో యూత్ లో క్రేజీ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రౌడీ బ్రాండ్ తో యువత మనసు దోచిన విజయ్ సినిమా థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టాడు. ఇక పాన్ ఇండియా స్టార్ గా వచ్చిన గుర్తింపుతో పలు ప్రకటనల్లో దర్శనం ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా…
అనుకున్నంత అయ్యింది.. కొత్తగా ఏమి జరగలేదు.. ఎప్పటినుంచో వస్తున్న పుకార్లను ఈరోజు నిజమేనని మేకర్స్ తేల్చేశారు. గత కొన్ని రోజుల నుంచి ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి సంక్రాంతి కానుకగా మొదటి సాంగ్ ని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడో.. ఇంకొద్దిసేపట్లోనో సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకొనేలోపు మేకర్స్ బాంబ్ పేల్చారు. కొన్ని…
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో చిత్రంతో గల్లా అశోక్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల కానుంది. గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను ప్రతి ఒక్కరు సినిమా బావుందని చెప్పడంతో సినిమాపై…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ ముగిసిపోతోంది. ఏంటి అప్పుడేనా..? మొన్ననే కదా స్టార్ట్ అయ్యింది.. అంటే అవును మొన్ననే స్టార్ట్ అయిన ఈ టాక్ షో 8 ఎపిసోడ్లతోనే సీజన్ పూర్తి చేసుకోనుంది. ఈ విషయాన్నీ ఆహా మేకర్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. బాలయ్య టాక్ షో అనగానే వామ్మో అని భయపడిన అభిమానులు మొదటి ఎపిసోడ్ చూశాక బాలయ్యలోని కొత్త కోణాన్ని చూశారు . వరుసగా మోహన్ బాబు,…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోతో తెలుగు ప్రేక్షకాభిమానులను తనదైన స్టైల్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఎపిసోడ్‌కి సినీ సెలెబ్రిటీలు కూడా రావడంతో టీఆర్పీ రేటింగ్ లోను దూసుకుపోతోంది. ఇదివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి వచ్చి ఎంటెర్టైన్మెంట్ చేయగా.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు షోలో కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దసరా స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చెయ్యబోతున్నారు. నేడు…
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా థియేటర్లలోను అలరిస్తోంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. గ్రామీణ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో లైటింగ్…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఒకసారి పనిచేసిన దర్శకులు కానీ హీరోలు గానీ మళ్ళీ మళ్ళీ ఆ బ్యానర్ లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా వాళ్ళను తనవైపుకు తిప్పుకుంటారు దిల్ రాజు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడికి, దిల్ రాజుకు ఉన్న అనుబంధం కూడా గట్టిదే. వరుసగా అదే బ్యానర్ లో సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే మహేశ్ బాబుతో మూవీ…