తక్కువ టైమ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడమే కాదు… పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తనదైన అటిట్యూడ్ తో యూత్ లో క్రేజీ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రౌడీ బ్రాండ్ తో యువత మనసు దోచిన విజయ్ సినిమా థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టాడు. ఇక పాన్ ఇండియా స్టార్ గా వచ్చిన గుర్తింపుతో పలు ప్రకటనల్లో దర్శనం ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే విజయ్ దేవరకొండను వెతుక్కుంటూ నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా పలకరిస్తున్నాయి.
తాజాగా థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ థమ్స్అప్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించారు. వారిద్దరి తర్వాత టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు ఆ అవకాశం దక్కింది. విజయ్ పాన్ ఇండియా ఇమేజ్ తమ ప్రాడక్ట్ మరింతగా ప్రజల్లోకి వెళుతుందనే నమ్మకాన్ని కంపెనీ భావిస్తోంది. థమ్స్ అప్ న్యూ అంబాసిడర్ విజయ్ దేవరకొండ అనే అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తూఫాన్, రౌడీ ఫర్ థండర్ వంటి యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. మంగళవారం నుండి అధికారికంగా సోషల్ మీడియా, టీవీలలో థమ్స్ అప్ కొత్త ప్రకటన ప్రసారం కానుంది. ప్రస్తుతం లైగర్ లో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత కూడా పలు పాన్ ఇండియా సినిమాలను లైనప్ చేయటం విశేషం..