హైదరాబాద్ నగర ప్రయాణికులకు మెట్రోరైలు అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు సూపర్ సేవర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్డుతో రోజంతా మెట్రోరైలులో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ కార్డు ధర రూ.59గా మెట్రో అధికారులు వెల్లడించారు. ఉగాది రోజు నుంచి సూపర్ సేవర్ కార్డులను విక్రయిస్తామని మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ కార్డుతో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగవచ్చన్నారు. కరోనా తర్వాత మళ్లీ మెట్రో సేవలను ప్రయాణికులకు…