ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. కాలి కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్-16వ సీజన్లో భాగంగా ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కంటే హైదరాబాద్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది.