Telugu Player Nitish Kumar Reddy Stats and Info: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఛాన్నళ్ల తర్వాత ఓ తెలుగు ఆటగాడు సత్తాచాటాడు. తెలుగు తేజం అంబటి రాయుడు తర్వాత ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 9) పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ రెడ్డి మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5…
సన్రైజర్స్ అభిమానులకు ఇదొక భారీ షాక్ అని చెప్పాలి. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఎడమ మడమ నొప్పి కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు ESPNcricinfo తెలిపింది. కాగా.. మినీ వేలంలో హసరంగను రూ. 1.5 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రిస్క్ తీసుకోకూడదని శ్రీలంక అతడికి పూర్తి విరామం ఇచ్చింది. ప్రస్తుతం హసరంగ శ్రీలంకలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం)సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్లో గెలిచి సత్తా చాటింది. కాగా.. ఈ మ్యాచ్తో చెన్నై వరుసగా రెండు ఓటములను నమోదు చేసుకుంది. మ్యాచ్ జరిగింది హైదరాబాద్లో అయినప్పటికీ.. అభిమానులు అందరూ చెన్నైకి సపోర్ట్ చేశారు. అయినా చెన్నై విజయం సాధించలేకపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్-సీఎస్కే మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్ లో గెలిచి సత్తా చాటింది. 166 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో మార్క్రమ్ (50) హాఫ్ సెంచరీతో రాణించాడు. అలాగే ఓపెనర్లు.. ట్రేవిస్ హెడ్ 31, అభిషేక్ శర్మ 37 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 37 పరుగులతో మెరుపు…
ఐపీఎల్ 2024లో భాగంగా... సన్ రైజర్స్-సీఎస్కే మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై బ్యాటర్ల దూకుడును ఆపారు. ముఖ్యంగా.. శివం దూబే క్రీజులో ఉన్నంతసేపు సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఒకానొక సమయంలో స్కోరు 200+ రన్స్ చేస్తుందని అనుకున్నారు. కానీ.. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. చెన్నై బ్యాటింగ్ కు దిగనుంది. ఇదిలా ఉంటే.. ఎస్ఆర్ హెచ్ కు ఉప్పల్ స్టేడియం హోంగ్రౌండ్ అయినప్పటికీ, చెన్నైకు సపోర్ట్ గా మారింది.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఏప్రిల్ 5న జరుగుతున్న మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తో పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఫామ్ లో ఉన్న జట్లలో ఒకటి. రుతురాజ్ గైక్వాడ్ అండ్ కో మూడు గేమ్ లు అడ్డాగా., వాటిలో రెండు గెలిచారు. వారి…
నేడు ఐపీఎల్ 2024 17వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఐపీఎల్ 2024 ప్రస్తుత సెషన్లో ఇరు జట్లకు ఇది నాల్గవ మ్యాచ్. మ్యాచ్ నేడు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్ లలో 4 పాయింట్లతో -0.738 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్…
ఐపీఎల్ చరిత్రలో రికార్డులకు తెలుగు రాష్ట్రాలు వేదికయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు హైదరాబాద్లో ఇటీవల నమోదు కాగా.. నేడు 2వ అత్యధిక స్కోరు వైజాగ్లో నమోదైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్పై గుజరాత్ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలిచింది. ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది.