సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 19 రోజుల తర్వాత తన సొంత రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద స్కోరును సాధించింది. కాగా.. దానిని SRH స్వయంగా బ్రేక్ చేసింది. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లు విధ్వంసంగా ఆడారు. ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్, అభిషేక్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లపై సన్ రైజర్స్ బ్యాటర్లు ఊచకోత చూపించారు. బెంగళూరు ముందు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. చినస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. వరుస సిక్సర్లతో సన్ రైజర్స్ బ్యాటర్స్ విరుచుకుపడ్డారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించాడు.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన బెంగళూరు.. బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఆడిన 6 మ్యాచ్ ల్లో ఐదింటిలో ఓడిపోయిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలని పట్టుదలతో బరిలోకి దిగుతుంది. మరోవైపు సన్ రైజర్స్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచి మరో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో గెలుస్తేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ కు అవకాశాలు ఉంటాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కూడా ఓడిపోతే ప్లే ఆఫ్స్ అవకాశాల మరింత సంక్లిష్టం అవుతాయి. ఈ…
Ambati Rayudu question Tom Moody Over His Selection in SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తెలుగు తేజం, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. ముంబై, చెన్నై జట్లు టైటిల్స్ గెలిచిన జట్టులో రాయుడు భాగం అయ్యాడు. 38 ఏళ్ల రాయుడు ఇంకా 2-3 ఏళ్లు ఆడే అవకాశం ఉన్నా.. రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఐపీఎల్ 2023 అనంతరం అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.…
Shikar Dhawan was stumped brilliantly by Heinrich Klaasen: క్రికెట్లో స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపర్స్ స్టంపింగ్ చేయడం మాములే. స్పిన్ బౌలింగ్‌లో స్టంప్స్‌కు దగ్గరగా ఉండి.. స్టంపింగ్ చేస్తుంటారు. ఫాస్ట్ బౌలింగ్‌లో స్టంప్స్‌కు దగ్గరగా.. వికెట్ కీపింగ్ చేయడం చాలా అరుదు. అందులోనూ స్టంపింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్.. ఫాస్ట్ బౌలింగ్‌లో మెరుపు స్టంపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం…
Jaydev Unadkat Last Over Video: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ అందరినీ భయపెట్టాడు. పంజాబ్ విజయానికి చివరి ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా.. ఉనాద్కట్ బౌలింగ్ సన్‌రైజర్స్ జట్టునే కాకుండా, అభిమానులను కూడా టెన్షన్ పెట్టింది. జయదేవ్ సిక్సులు ఇస్తూ, వైడ్లు వేస్తూ.. మ్యాచ్‌ను నరాలు తెగే ఉత్కంఠకు తీసుకెళ్లాడు. చివరకు ఈ మ్యాచ్‌లో విజయం హైదరాబాద్ జట్టును వరించింది. ఫలితంగా…
SRH Hero Nitish Kumar Reddy about Pawan Kalyan’s Narajugakura Song: ప్రస్తుతం సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి పేరే మార్మోగిపోతోంది. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ చెలరేగడమే ఇందుకు కారణం. 10 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 64 పరుగులే అయినా.. 20 ఓవర్లు ముగిసేసరికి 182 స్కోర్ చేసిందంటే కారణం నితీశ్. ప్రతికూల పరిస్థితుల్లో చెలరేగి ఆడిన ఈ…
Telugu Player Nitish Kumar Reddy Stats and Info: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఛాన్నళ్ల తర్వాత ఓ తెలుగు ఆటగాడు సత్తాచాటాడు. తెలుగు తేజం అంబటి రాయుడు తర్వాత ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 9) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ రెడ్డి మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5…
సన్‌రైజర్స్ అభిమానులకు ఇదొక భారీ షాక్ అని చెప్పాలి. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఎడమ మడమ నొప్పి కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు ESPNcricinfo తెలిపింది. కాగా.. మినీ వేలంలో హసరంగను రూ. 1.5 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రిస్క్ తీసుకోకూడదని శ్రీలంక అతడికి పూర్తి విరామం ఇచ్చింది. ప్రస్తుతం హసరంగ శ్రీలంకలో విశ్రాంతి తీసుకుంటున్నారు.