ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్పై గుజరాత్ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలిచింది. ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది.
Tragedy: విహారయాత్రలో విషాదం.. జలపాతంలో పడి ఓ వ్యక్తి మృతి
గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (45), డేవిడ్ మిల్లర్ (44) పరుగులతో నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (36) పరుగులతో రాణించాడు. సాహా (25), విజయ్ శంకర్ (14) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, కమిన్స్ తలో వికెట్ తీశారు.
Mallikarjun Kharge: ‘‘రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు’’.. పప్పులో కాలేసిన ఖర్గే..
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (19), మయాంక్ అగర్వాల్ (16) పరుగులు చేసి అనుకున్నంత శుభారంభాన్ని అందించలేకపోయారు. పోయిన మ్యాచ్ లో హీరో.. అభిషేక్ శర్మ (29) పరుగులు చేశారు. మార్క్రమ్ (17), క్లాసెన్ (24), షాబాజ్ అహ్మద్ (22), చివరలో అబ్దుల్ సమద్ (29) మెరుపులు మెరిపించాడు. ఇక.. గుజరాత్ బౌలింగ్ లో మోహిత్ శర్మ 3 వికెట్లతో చెలరేగాడు. కీలక వికెట్లు తీసి జట్టు స్కోరును ఆపడంలో సహాయపడ్డాడు. ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ సంపాదించారు.