జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తూగో జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఇదంతా దిల్ రాజు కుట్రలో భాగమని ఆరోపించారు. సినిమా థియేటర్ల బంద్ విషయంలో తన పేరును దురుద్దేశంతో లాగారని, ఈ వివాదం వెనుక దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్…
థియేటర్లకు సంబంధించిన తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) ఒక ప్రకటన జారీ చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు సినిమా థియేటర్లను కేవలం షేర్ ఆధారిత వ్యవస్థ ద్వారా నడపాలని లేదా పర్సంటేజ్ పద్ధతుల ఆధారంగా నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారని కొన్ని న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ పూర్తిగా అసత్యమని, ఇటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని టీఎస్‌ఎఫ్‌సీసీ స్పష్టం చేసింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వల్ల తిరుమలలో రోడ్లు జామయ్యాయి అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి ధారావి అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధారావి అనగానే కచ్చితంగా…
”సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, సినిమాటోగ్రఫి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం” అని అన్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌ను తెలుగు సినిమా నిర్మాతలు కలిశారు. దిల్ రాజు, డీవివి దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసులు ఈరోజు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై నిర్మాతలు పవన్‌తో చర్చించారు. ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారంపై గత కొన్ని రోజులుగా రగడ జరుగుతున్నది. సినిమా వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి తెర దించేందుకు సినీ నిర్మాతలు రంగంలోకి దిగారు.…
సినిమా పరిశ్రమ తప్పు లేకపోయినా తెలుగు చిత్రసీమకే నష్టం కల్గించే సంఘటనలు కొందరి ద్వారా ఇటీవల ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు చెబుతున్న అభిప్రాయంలో ఏకీభవించడం లేదని, సినిమా టిక్కెట్ల విషయంలో ఆన్లైన్ విధానంకు మద్దతు ఇస్తున్నామని, తమ ఆర్ధిక ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సినిమా నిర్మాతలు తనను అభ్యర్ధించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. బుధవారం మచిలీపట్నం లోని…
టాలీవుడ్ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీవాసుతో పాటు మరికొందరు కలిసి ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం.. పేర్నినాని మాట్లాడుతూ.. ‘నన్ను కలవాలని నిర్మాతలు నిన్న అడిగారు.. ఇండస్ట్రీకి నష్టం జరిగే సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని నాతో మాట్లాడాలి అన్నారు. ఇండస్ట్రీ అంతా ఒక్కమాటపై ఉన్నాము.. ఇదే మాట సీఎంకు చెప్పండి అని కోరారు. ఆన్లైన్ టికెట్లపై మేము అనుకూలం అని నిర్మాతలు చెప్పారు. ఇప్పటికే పోర్టల్స్…
ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చర్చలు ముగిసింది. దిల్ రాజుతో పాటు నిర్మాతలు డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీవాసు మరికొందరు కలిసి పేర్ని నానితో చాలా సేపు మంతనాలు జరిపారు. దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ.. ‘చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి గతంలోనే సీఎంను కలిశాము. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. దయచేసి అందరూ…
ఆగస్ట్ 28వ తేదీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ సర్వ సభ్య సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశం అనంతరం రాబోయే రెండు సంవత్సరాలు (2021-23)కి గానూ కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. ఇందులో ప్రముఖ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, నిర్మాత సునీల్ నారంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా బాల గోవింద్ రాజ్ తడ్ల, వి.ఎల్. శ్రీధర్, ఎ. ఇన్నారెడ్డి వ్యవహరించబోతున్నారు. కార్యదర్శిగా కె. అనుపమ్ రెడ్డి, సంయుక్త…