జీవోనెం120ని స్వాగతిస్తున్నాం: తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
”సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, సినిమాటోగ్రఫి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం” అని అన్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ – ”చిన్న సినిమాలు 50 -150 రూపాయల వరకూ టికెట్ అమ్ముకోవచ్చు. దానిని మించి అధిక ధరలకు టికెట్లు విక్రయించకూడదు. ఈ రోజు కొన్ని థియేటర్స్‌లో టికెట్ రేట్లు ఎక్కువ రేటుకి అమ్మడం మా దృష్టికి వచ్చింది. మేం వెంటనే స్పందించి ఆ రేట్లను సవరించి మిగతా డబ్బుని వారి ఎకౌంట్స్‌కి రిఫండ్ చేయడం జరిగింది. మాకు ప్రేక్షకుల సౌకర్యాలే ముఖ్యం. ప్రస్తుతం నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు ఈ విధానం గురించి అవగాహన కలిపిస్తున్నాం. మీడియా సహకారంతో ఈ జీవోపై మరింత మందికి అవగాహన వస్తుందని నమ్ముతున్నాం. కొన్ని థియేటర్స్ క్యాంటిన్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాటిని కూడా సవరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం” అని అన్నారు.
తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి మాట్లాడుతూ – ”గవర్నమెంట్ ఇటీవల జీవో నెం 120ని విడుదలచేసింది. ప్రతి ఒక్క సినిమాకు లాభం జరగాలి అనేదే దాని సారాంశం. అందులో మినిమం, మ్యాగ్జిమం రేట్లను నిర్ణయించారు. చిన్న సినిమాలు మినిమం రేట్లకు, మీడియం సినిమాలు మొదటి వారం రోజులు మ్యాగ్జిమం రేట్లకు అమ్మాలి. తర్వాత మినిమం రేటుకు అమ్మాలి. పెద్ద సినిమాలు మొదటి రెండు వారాలు మ్యాగ్జిమం తర్వాత మినిమం రేట్లకు అమ్మాలి. ఈ రేట్లు అన్ని పన్నులతో సహా ఉంటాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!