Edible Oil Import Reduced : దేశంలోని ఎడిబుల్ ఆయిల్ దిగుమతి జనవరిలో వార్షిక ప్రాతిపదికన 28 శాతం తగ్గి 12 లక్షల టన్నులకు చేరుకుంది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) సోమవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది.
Edible oil prices: ధరలతో అల్లాడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ముఖ్యంగా సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5కి తగ్గించింది ప్రభుత్వం.
Today (10-02-23) Business Headlines: జెమినీ ప్యూర్ఇట్ సన్‌ఫ్లవర్ ఆయిల్: కార్గిల్ అనే సంస్థ ఇటీవల జెమినీ ప్యూర్ ఇట్ పొద్దు తిరుగుడు నూనెను విడుదల చేసింది. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లలోకి కూడా అందుబాటులోకి తేనుంది. ఇది ప్రీమియం క్వాలిటీతో కూడిన ప్రొడక్ట్ అని కార్గిల్ ఫుడ్ ఇన్‌గ్రిడియెంట్స్ సౌత్ ఏసియా కన్జ్యూమర్ బిజినెస్ హెడ్ అవినాశ్ త్రిపాఠి తెలిపారు.
దేశంలో వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. లీటరుకు గరిష్టంగా రూ.15 వరకు తగ్గింపు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో మరో వారంలో హోల్‌సేల్ మార్కెట్లలో నూనె ధరల తగ్గింపు అమలు కానుంది. పామాయిల్‌పై లీటరుకు రూ.7 నుంచి 8, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై రూ.10 నుంచి 15 వరకు, సోయాబీన్‌పై రూ.5 తగ్గే అవకాశం ఉంది. మే నెలలో వంట నూనెల కేటగిరిలో రికార్డు స్థాయిలో 13.26 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. దీంతో…
గత కొంతకాలంగా వంటగదికి వెళ్లాలంటేనే సామాన్యులకు వణుకు పుడుతోంది. వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. గతంలో కంటే సగం పైగా ధర పెరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో సన్ ఫ్లవర్ నూనె ధరలు పెరిగిపోవడం వల్ల ఇప్పటికే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ఎగుమతులపై ఇండోనేషియా తాజాగా నిషేధం విధించింది. దీంతో ధరలు మళ్ళీ ఆకాశాన్నంటడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం జోక్యం చేసుకోకపోతే ధరల పెరుగుదల…
భారత దేశంలో వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వంటనూనె దిగుమతులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో నూనె ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి వంటనూనెను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన భారత్.. ఆ దేశం నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కొనుగోలు చేసింది. ఈ దిగుమతుల కోసం భారీ ధర చెల్లించింది. పామాయిల్ సరఫరాను పరిమితం చేయాలని ఇండోనేషియా నిర్ణయించడం, దక్షిణ…
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండోరోజుకు చేరుకుంది.. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధానిలోకి సైతం రష్యా బలగాలు ప్రవేశించాయి.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునేలా అడుగులు వేస్తోంది రష్యా.. ఇప్పటికే కొన్ని ఉక్రెయిన్ పరిపాలనా భవనాలపై రష్యా జెండాలు ఎగురుతున్నాయి.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్.. మరో 96 గంటల్లో రష్యా చేతిలోకి రాజధాని కీవ్ నగరం పూర్తిస్థాయిలో వెళ్లిపోతుందని తెలిపారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త…