సాధారణంగా కమర్షియల్ సినిమాలన్నీ ప్రేమతో మొదలై పెళ్లితో ‘ద ఎండ్’ అవుతాయి. కానీ, సుమంత్, నైనా గంగూలీ నటించిన ‘మళ్లీ మొదలైంది’ సినిమా విషయంలో… శుభం కార్డు నుంచీ కథ మొదలయ్యేలా కనిపిస్తుంది! ‘లైఫ్ ఆఫ్టర్ డైవోర్స్’ అంటున్నాడు అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్… నిజానికి ‘మళ్లీ మొదలైంది’ సినిమాకు సంబంధించి ఓ వెడ్డింగ్ కార్డ్ ఫోటో అనూహ్యంగా లీకైంది. దాంతో అందరూ సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని భావించారు. రామ్ గోపాల్ వర్మ అయితే రెండో…
అక్కినేని యంగ్ హీరో సుమంత్ రెండవ పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ విషయం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్. సుమంత్ కుమార్ యార్లగడ్డ పలు తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా చిత్రాలతో డీసెంట్ హిట్లు కొట్టారు. సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు పెద్ద మనవడు. ఇక ఇప్పుడు సుమంత్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది ఆయనకు రెండవ వివాహం. ఈ మేరకు…
వైవిధ్యమైన చిత్రాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్. అతని తాజా చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’ మను యజ్ఞ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని గార్లపాటి రమేష్, డా. టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రమని, ఆయన పాత్ర రొటిన్‌కు భిన్నంగా వుంటుందని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆ పాత్ర తప్పకుండా నచ్చుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.…
సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా మే 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్రంలో అక్కినేని హీరో సుమంత్ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. త్రివిక్రమ్…
మను యజ్ఞ దర్శకత్వంలో అక్కినేని హీరో సుమంత్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘అనగనగా ఒక రౌడీ’. ఏక్ ధో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని గార్లపాటి రమేష్, డాక్టర్ టిఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చుతుండగా, సినిమాటోగ్రఫీని పవన్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ధనరాజ్, మధునందన్, మిర్చి కిరణ్, మనోజ్ నందన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ మాస్…