మను యజ్ఞ దర్శకత్వంలో అక్కినేని హీరో సుమంత్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘అనగనగా ఒక రౌడీ’. ఏక్ ధో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని గార్లపాటి రమేష్, డాక్టర్ టిఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చుతుండగా, సినిమాటోగ్రఫీని పవన్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ధనరాజ్, మధునందన్, మిర్చి కిరణ్, మనోజ్ నందన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ మాస్ ఎంటర్టైనర్ లో సుమంత్ వాల్తేరు శ్రీను అనే రౌడీ పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా సుమంత్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుపుతూ శనివారం ట్వీట్ చేశాడు సుమంత్. ఈ మేరకు ‘అనగనగా ఒక రౌడీ’ పోస్టర్ ను షేర్ చేసిన సుమంత్ ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరారు.