అక్కినేని యంగ్ హీరో సుమంత్ రెండవ పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ విషయం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్. సుమంత్ కుమార్ యార్లగడ్డ పలు తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా చిత్రాలతో డీసెంట్ హిట్లు కొట్టారు. సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు పెద్ద మనవడు. ఇక ఇప్పుడు సుమంత్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది ఆయనకు రెండవ వివాహం. ఈ మేరకు వెడ్డింగ్ కార్డులను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ వివాహం చేసుకోనున్నట్టు స్పష్టమవుతోంది. పెళ్లి వేడుకకు స్నేహితులకు, బంధువులకు శుభలేఖల ద్వారా ఆహ్వానాలను పంపుతున్నారు.
Read Also : విలక్షణమే ధనుష్ ఆయుధం!
2004లో సుమంత్ మొదటి వివాహమైంది. కృతి రెడ్డిని ఆయన వివాహం చేసుకున్నారు. 2006లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇది అక్కినేని కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది. గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ “పెళ్ళైన రెండేళ్ల తర్వాత నేను ఆమెతో విడిపోయాను. ఆమె మళ్ళీ వివాహం చేసుకుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది. ఆమె నా మాజీ భార్య అయినప్పటికీ మేము ఇంకా మంచి స్నేహితులుగానే ఉన్నాము“ అని తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న కీర్తి రెడ్డి, సుమంత్ వారి బంధాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయారు. మొత్తానికి చాలా సమయం తరువాత సుమంత్ రెండవ పెళ్ళికి రెడీ కావడం విశేషం.