తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, అంతా సీఎం కేసీఆర్ చలువ వల్లనేనన్నారు ప్రముఖ సినీ నటుడు సుమన్. హైదరాబాద్ రామంతపూర్ లో జరిగిన ఎస్.ఎన్. ఎస్. డెవలపర్స్ నూతన వెంచర్ బ్రోచర్ ను నటుడు సుమన్ విడుదల చేశారు. యాదగిరిగుట్ట సమీపంలోని రాజపేట లో 50 ఎకరాలలో తమ ఆరవ వెంచర్ ఏర్పాటు చేస్తున్నామని, యాదాద్రి- కరీంనగర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న తమ వెంచర్ ఉంటుందని కస్టమర్లకు అన్నిరకాల సదుపాయాలతో తమ వెంచర్…
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి…
(ఆగష్టు 28న సుమన్ పుట్టినరోజు)నవలానాయకునిగా ఆ రోజుల్లో రచయితలు వర్ణించిన తీరుకు అనుగుణంగా ఉండే రూపం హీరో సుమన్ సొంతం. ఆరడుగులకు పైగా ఎత్తు, పసిమి మేని ఛాయ, కోటేరు ముక్కు, ముఖంపై చెరగని కాంతి, సదా చిరునవ్వులు చిందే పెదాలు… ఇలా నవలానాయకుల వర్ణనలు సాగేవి. అందుకు తగ్గ రూపంతో ఉన్న సుమన్ ఇట్టే చూపరులను ఆకట్టుకొనేవారు. అందుకే పెద్దగా శ్రమించకుండానే హీరోగా అవకాశాలు లభించాయి. తొలుత తమిళంలో తడాఖా చూపిన ఈ కరాటే మాస్టర్,…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉండగానే పరిస్థితులు వేడెక్కుతున్న విషయం తెలిసిందే. “మా” ఎలక్షన్స్ లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఏకంగా 5 మంది ‘అధ్యక్ష’ పదవికి పోటీగా దిగుతున్నారు. అందులో యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ హీరోయిన్ జీవిత రాజశేఖర్, హేమ, మరో సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. అయితే వీరిలో మంచు విష్ణుకు సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.…
నగుమోము నగ్మా, నగిషీల మహిమ తొలిసారి తెలుగుతెరపై వెలిగింది ‘పెద్దింటల్లుడు’ చిత్రంతో. ఈ సినిమాలోనే ముద్దుగా బొద్దుగా కనిపించిన నగ్మా వచ్చీ రాగానే తెలుగువారిని ఆకర్షించేసింది. సుమన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించారు. వాణిశ్రీ మరో ముఖ్యభూమికలో అలరించారు. షమ్మీ కపూర్ ‘ప్రొఫెసర్’ చిత్రం పోలికలు ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆ చిత్రాన్నే యన్టీఆర్ హీరోగా ‘భలే మాస్టర్’ పేరుతో తెలుగులో తెరకెక్కించారు. కాబట్టి మన తెలుగువారికి ‘పెద్దింటల్లుడు’…