ఓ వార్డు వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవి కుమార్ అనే వ్యక్తి తాడేపల్లిలో నిన్నటి నుంచి కనిపించడం లేదు. అయితే రవికుమార్ ఈ రోజు నదిలో శవమై కనిపించాడు. దీంతో రవికుమార్ శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేయడంతో అతడు వాలంటీర్ రవికుమార్‌గా గుర్తించారు. అంతేకాకుండా అతడి వద్ద సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లు పోలీసులు…
కామారెడ్డిలో ఓ వివాహత అనుమానస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిప్రసాద్, శిరీష(32)లు దంపతులు. బెంగూళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో వీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గత కొంతకాలంగా ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం శిరీష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని భర్త హరిప్రసాద్ శిరీష తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు హరిప్రసాదే శిరీషను హత్యచేసి ఆత్మహత్యగా…
ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్నారు.. ఎంతో అన్యోన్యంగా కాపురాన్ని మొదలుపెట్టారు. ఆ జంటను చూస్తే చుట్టూ ఉన్నవారు కుళ్లుకోనేవారు. ఉదయం భర్త బయటికి వెళ్లేటప్పుడు చిరునవ్వులు చిందిస్తూ భార్య ఎదురురావడం.. సాయంత్రం ఇంటికి వచ్చి భార్యతో అతను కబుర్లు చెప్పడం.. భార్యాభర్తల అంటే ఇలాగే ఉండాలి అనేంత అన్యోన్యంగా ఉన్న ఆ జంటను చూసి విధికి కన్ను కుట్టింది. అనుకోని విబేధాల వలన ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన విజయనగరంలో…
భార్యాభర్తలు అన్నాకా గొడవలు సహజం.. ఆ గొడవల వలన ఎడబాటు సాధారణం. భార్య పుట్టింటికి వెళ్లడం, లాగడం , మళ్లీ భర్త ఇంటికి తీసుకురావడం ప్రతి ఒక్కరి కాపురంలో జరిగేవే.. కానీ, కొంతమంది మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను వదిలేస్తున్నారు. తాజాగా భర్త తనను కాపురానికి తీసుకువెళ్లడంలేదని ఒక భార్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. కర్ణాటకకు చెందిన చందునాయక్ కి మదనపల్లెకు చెందిన రమ్యశ్రీకి…
ఎంతో చక్కని కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఒక పక్క భార్యతో గొడవలు.. ఇంకోపక్క ప్రియురాలిని వదిలి ఉండలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్, చందా నగర్ కి చెందిన సాయి నవీన్ ని నాలుగేళ్ళ క్రితం కూకట్ పల్లి కి చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉండగా.. ప్రస్తుతం అతని భార్య గర్భవతిగా ఉంది. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్దీ రోజుల…
హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పెళ్లికి పెద్దలు నిరాకరించారనీ ఆత్మహత్య యత్నం చేసింది జంట. అయితే ప్రియురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రియుడు గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఒంగోలు కు చెందిన నాగ చైతన్య , కోటి రెడ్డి ప్రేమించుకున్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తోంది నాగ చైతన్య. మెడికల్ రెప్రజెంటేటివ్ గా చేస్తున్నాడు కోటి రెడ్డి. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు…
సినిమా ఆర్టిస్ట్ సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సైద్ రహీమ్ అనే 24 ఏళ్ళ యువకుడు సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. పలు సినిమాల్లో నటించిన సైద్ తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.…
రోజురోజుకు ప్రజల మానసిక స్థితి ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే ఇది.. హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీకి చెందిన ఓ మహిళ తన తండ్రి మందలించడంతో ఉసురుతీసుకుంది. మమత అనే మహిళ తన తల్లిదండ్రులతో కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉంటోంది. మమత కు 2019 వివాహం జరిగింది. అయితే భర్తకు కాన్సర్ ఉందని తెలియడంతో రెండు నెలలకే విడాకులు…
తిరుపతిలోని శ్రీకాళహస్తిలో వాలంటీర్ చందన ఆత్మహత్యకు పాల్పడింది.. రైలు నుంచి దూకి రెండేళ్ల కుమారుడితో పాటు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె రైలు పట్టాలపై విగతజీవిగా మారింది. తిరుపతి నుంచి నెల్లూరు మార్గంలో రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం అక్కుర్తి గ్రామం వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.…
ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని ఎంత హెచ్చరిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్స్ మోజులో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. చెన్నైలోని కృష్ణగిరి జిల్లా హోసూరులో మోహన్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. అయితే మోహన్ కు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడడం అలవాటుగా మారింది. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ..అందులో…