మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగు చూసింది. ముంబయిలోని మాల్వానీ ప్రాంతంలో రుతుక్రమం గురించి అవగాహన లేని ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి సారి పీరియడ్‌తో ఒత్తిడికి లోనైన ఆమె కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
ఓ అమ్మాయి వేధింపుల వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు మృతుడి బంధువులు. కరీంనగర్ శివారులోని తీగల వంతెన పై రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలానికి చెందిన రాజశేఖర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గం మద్యంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. తన చావు కారణమైన వారిని శిక్షించాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.…
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం వెదురుకుప్పంలో పురుగుల మందు తాగి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదమ్ముల భూమి పరిష్కార విషయంలో పోలీసుల జోక్యం చేసుకుని.. చంద్రశేఖర్‌ను పోలీసులు కొట్టడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి చంద్రశేఖర్ (50) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
కర్ణాటకలో 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన పర్సులోని రూ.2 వేలు దొంగిలించిందని టీచర్ అనుమానించి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పాఠశాలలో జరిగిన సంఘటనల కారణంగానే బాలిక ఈ దారుణానికి ఒడిగట్టిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లాలో తెనాలి నాజర్ పేటలో కిరణా షాపు వ్యాపారి కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి శంకర్ రావు అనే వ్యాపారి కుటుంబం ప్రయత్నించింది. ఇక, భార్య, కుమార్తె కుటుంబం విష గుళికలు మింగారు.
జేఈఈ (JEE) కారణంగా మరో విద్యాకుసుమం నేలరాలిపోయింది. సారీ నాన్నా... నేను జేఈఈ చేయలేను అంటూ తనువు చాలించాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ (Rajasthan) కోటాలో చోటుచేసుకుంది.
తెలంగాణలోని జనగామ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన చిన్ననాటి స్నేహితురాలు కలలోకి వచ్చి తన దగ్గరికి రమ్మంటుందని మృతురాలు తన సోదరుడికి చెప్పి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 3 సంవత్సరాల క్రితం మరణించిన స్నేహితుడు కలలోకి వస్తున్నాడని భయపడుకుంటూ చెప్పి.. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల్షాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని కొత్తగూడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని విద్యశ్రీ (23) బలవన్మరణానికి పాల్పడింది. 12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.