సూడాన్‌లోని సిన్నార్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక గ్రామంలో పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) నరమేధం సృష్టించింది. ఐదు రోజుల ముట్టడి తర్వాత సిన్నార్ ప్రావిన్స్‌లోని జలక్ని గ్రామంలోని అబూ హుజార్ ప్రాంతంలో గురువారం ఆర్‌ఎస్‌ఎఫ్ కాల్పులు జరిపింది. ఈ దాడిలో 80 మంది చనిపోయారు.
సూడాన్‌లో తిరుగుబాటు దళాల దాడిలో దాదాపు 150 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు, సాక్షులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడాది కాలం యుద్ధంలో ఇప్పటి వరకు 7 మిలియన్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
Israel Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ముస్లిం దేశం సూడాన్ నుండి ఓ భయానక నివేదిక వెలువడింది. సూడాన్‌లో అత్యాచారం, లైంగిక హింస కేసులు విపరీతంగా పెరిగాయి.
సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ దళం (RSAF) మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆదివారం రాజధాని ఖార్టూమ్‌లోని మార్కెట్‌లో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది చనిపోయారు. దాదాపు 36 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు.
Sudan: సూడాన్ దేశం సైనిక వర్గాల మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. దేశంలో సైన్యం, పారామిలిటరీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. 12 వారాలుగా ఈ ఘర్షణ జరుగుతూనే ఉంది. ఈ రెండు విభాగాలకు చెందిన అధిపతుల మధ్య పోరు మొత్తం దేశాన్ని అతలాకుతలం చేస్తుంది.
సూడాన్‌లో నెలకొన్న అంతర్యుద్ధం మూలంగా దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ప్రాణాలను కోల్పోతున్నారు.
సూడాన్ లో సంక్షోభం మరింతగా ముదురుతోంది. అక్కడి ప్రజల పరిస్థితులు దయనీయంగా మారిపోయాయి. అక్కడ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణల కారణాలతో ఖార్టూమ్ అనాథాశ్రమంలో 60 మంది చిన్నారులు బలయ్యారు.