సూడాన్ లో సంక్షోభం మరింతగా ముదురుతోంది. అక్కడి ప్రజల పరిస్థితులు దయనీయంగా మారిపోయాయి. అక్కడ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణల కారణాలతో ఖార్టూమ్ అనాథాశ్రమంలో 60 మంది చిన్నారులు బలయ్యారు. వీరిలో శిశువులు, పసిబిడ్డలు, పెద్ద పిల్లలు ఉన్నారు. ఆహారం లేక ఆరోగ్యం క్షీణించి జ్వరంతో మరణించారని అక్కడి మీడియా తెలిపింది. అసలు ఇలా జరగడానికి కారణమేంటంటే.. సైన్యం-పారామిలిటరీ బలగాలకు మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ ఆధిపత్య పోరు సూడాన్ లో చిన్నారుల పాలిట మారణశాపంలా మారింది. తినడానికి తిండిలేకనే గత ఆరువారాలుగా ఆకలితో అలమటించి చనిపోయారు. కేవలం వారంలో రెండు రోజుల్లోనే 26 మంది చనిపోయారు. అంటే చూడొచ్చు అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో..
Also Read : Bhatti Vikramarka: మాయల పకీర్ లాంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు..
చిన్నారులు మృత్యువాత వార్త సోషల్ మీడియాలో ఆందోళనను, ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో అక్కడి స్థానిక స్వచ్ఛంద సంస్థ ఆదివారం అనాథాశ్రమానికి ఆహారం, మందులు, బేబీ ఫార్ములాను అందించింది. ఐక్యరాజ్యసమితి పిల్లల ఏజెన్సీ, యునిసెఫ్-ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ సహాయంతో ఈ చర్యలు చేపట్టింది. మరోవైపు అక్కడి ఘర్షణ నేపథ్యంలో.. మరింత మంది పిల్లలు చనిపోయే అవకాశం ఉందనీ, ఖార్టూమ్ లోని అనాథశ్రమం నుంచి వారిని త్వరగా ఖాళీ చేయించాలని సిబ్బందిని హెచ్చరించారు. ఈ యుద్ధం ఏప్రిల్ 15న ప్రత్యర్థి సైనిక వర్గాల మధ్య చెలరేగి.. ఖర్టూమ్ సహా ఇతర పట్టణ ప్రాంతాలను యుద్ధభూమిగా మార్చింది.
Also Read : Sudigali Sudheer: ‘జబర్దస్త్’ కెవ్వు కార్తీక్ పెళ్లి.. ట్రెండ్ అవుతున్న సుధీర్
ఈ పోరులో పౌరులు, ముఖ్యంగా చిన్నారులు చనిపోయారు. కనీసం 860 మంది పిల్లలు, 190 మందికి పైగా పౌరులు మరణించారు. వేలాది మంది గాయపడ్డట్లు పౌరుల మరణాలను ట్రాక్ చేసే సూడాన్ డాక్టర్స్ సిండికేట్ తెలిపింది. అంతేకాకుండా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఘర్షణల నేపథ్యంలో 1.65 మిలియన్లకు పైగా ప్రజలు సూడాన్ లోని సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. మరికొంత మంది దేశం విడిచి వెళ్లిపోయారు.